RC17లోనూ అదే ఒరవడి? ఊరమాస్‌గా రామ్‌చరణ్ పాత్ర?

ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న నెక్ట్స్‌ మూవీ అంతకుమించి అన్నట్లు ఉండబోతోందని టాక్‌.

RC17లోనూ అదే ఒరవడి? ఊరమాస్‌గా రామ్‌చరణ్ పాత్ర?

సుకుమార్‌ డైరెక్షన్‌లో RC17 సినిమాలో రామ్‌చరణ్‌ రోల్‌ ఎలా ఉండబోతోంది? రంగస్థలం, పుష్ప సినిమాల్లో హీరోలను మాస్‌ గెటప్‌లో చూపించిన సుకుమార్‌… RC17లోనూ అదే ఒరవడి కొనసాగించబోతున్నాడా? లేక రామ్‌చరణ్‌ను సరికొత్తగా ఆవిష్కరించబోతున్నాడా? టాలీవుడ్‌ను ఉత్కంఠకు గురిచేస్తున్న RC17పై తాజా అప్డేట్‌ ఏంటి?

రంగస్థలం తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో RC17 చిత్రానికి ఓకే చెప్పాడు రామ్‌చరణ్‌.. ట్రిపుల్‌ ఆర్‌, గేమ్‌ఛేంజర్‌ చిత్రాలకు ఎక్కువ సమయం తీసుకున్న రామ్‌చరణ్‌ ఇక వేగంగా సినిమాలు తీయాలనే ఆలోచనతో వరుసగా కొత్త ప్రాజెక్టులకు కమిట్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో బుచ్చిబాబు సెట్స్‌పై రాబోతుండగా, సుకుమార్‌ సినిమాకు కూడా అంతా రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు.

రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ఛేంజర్ సినిమా ఫినిష్ చేశాడు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో నెక్ట్స్‌ మూవీలో నటించనున్నాడు. మరో వైపు స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కూడా పుష్ప2 సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇటు రాంచరణ్, అటు సుకుమార్ ఇద్దరూ తమ సినిమాలను డిసెంబర్‌ బరిలో ఉంచారు.

స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ
ఇక ఈ ఇద్దరు కలసి RC 17 సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. దీని కోసం సుకుమార్ టీమ్, సీనియర్ రైటర్లు స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఇందులో రామ్‌చరణ్ పాత్ర ఊరమాస్‌గా ఉండబోతుందని టాక్. ఇప్పటికే రంగస్ధలం సినిమాలో చరణ్‌ను మాస్‌లుక్‌లో చూపించాడు సుకుమార్‌.

దీంతో ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న నెక్ట్స్‌ మూవీ అంతకుమించి అన్నట్లు ఉండబోతోందని టాక్‌. కొత్త లుక్‌లో రామ్ చరణ్ అందరిని భయపెట్టేస్తాడంటున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన అన్ని డిటైల్స్ పుష్ప2 సినిమా కంప్లీట్ అవ్వగానే ఎనౌన్స్ చేస్తారంటున్నారు. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి రామ్‌చరణ్ ఫ్యాన్స్ పుల్‌ ఖుషీ అవుతున్నారు.

Also Read: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌లోనూ హోస్ట్‌గా హీరో నాగార్జున.. టీజర్‌ విడుదల.. ఫన్ మొదలు