MAA Elections: ‘మా’ ఎన్నికల ఫలితాలపై.. ఎవరేమన్నారంటే…!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. మంచు విష్ణు గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నారు. మా ఎన్నికల అధికారి.. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.
- Ravikanth 10tv
- Published On : October 10, 2021 / 11:27 PM IST
Comments
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. మంచు విష్ణు గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నారు. మా ఎన్నికల అధికారి.. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సమయంలో.. విష్ణు భావోద్వేగానికి గురై.. కంట తడి పెట్టుకున్నారు. ప్రకాష్ రాజ్.. విష్ణును ఓదార్చి.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. విష్ణుకు కంగ్రాట్స్ చెప్పారు. తెలుగు బిడ్డను టాలీవుడ్ నటులు.. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకన్నారంటూ ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు.
Also Read: MAA Elections: మంచు విష్ణు కంటతడి.. ఫలితాల అధికారిక ప్రకటన సమయంలో కన్నీళ్లు!
తన గెలుపు మోహన్ బాబుదే అని విష్ణు చెప్పారు. ఎన్నికల విషయంలో ఇంత దూరం వచ్చి ఉండకూడదని.. అన్నారు. ఇలాంటి వాతావరణం మా.. లో లేకుండా చూస్తానని చెప్పారు. తన విజయం ప్రతి ఒక్క సభ్యుడిదని అన్నారు.. విష్ణు.
Also Read: MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓటమి.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్
మా అధ్యక్షుడిగా తన కుమారుడు మంచు విష్ణు విజయంపై.. మోహన్ బాబు ఆనందంగా స్పందించారు. ఇది అందరి విజయమని.. అంతా మన వాళ్లే అని అన్నారు. విష్ణు.. హామీలు నెరవేరుస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. గతాన్ని వదిలి.. అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇండస్ట్రీ పెద్దలు.. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ ఆశీస్సులు విష్ణుకు ఉండాలని మోహన్ బాబు ఆకాంక్షించారు. మా ఎన్నికల విషయంలో నరేష్ చాలా కష్టపడ్డాడని.. నరేష్ తనకు తమ్ముడిలాంటివాడని చెప్పారు. బాబా.. ఈ విజయాన్ని అందించాడని అన్నారు.
Also Read: MAA Elections: మంచు విష్ణు విజయం.. ఫ్యాన్స్ సంబరాలు
మా.. మసకబారింది అంటూ.. విష్ణు ప్యానెల్ ప్రత్యర్థులు చేసిన విమర్శలపై.. నరేష్ మరోసారి స్పందించారు. మా.. మసకబారలేదని.. మెరుగుపడిందని స్పష్టం చేశారు. విష్ణు విజయంపై.. నరేష్ చాలా ఉత్సాహంగా కనిపించారు.
Also Read: MAA Elections: మంచు విష్ణు విజయం
