Revu : ‘రేవు’ ట్రైలర్ రిలీజ్.. ఈ సినిమా చూసి రివ్యూ ఇస్తా అన్న దిల్ రాజు..

తాజాగా రేవు సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Revu : ‘రేవు’ ట్రైలర్ రిలీజ్.. ఈ సినిమా చూసి రివ్యూ ఇస్తా అన్న దిల్ రాజు..

Revu Movie Trailer Launched By Producer Dil Raju

Revu Trailer : వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రేవు’. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్, పారుపల్లి ప్రొడక్షన్ బ్యానర్స్ పై డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్త నిర్మాణంలో హరినాథ్ పులి దర్శకత్వంలో రేవు సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు నిర్మాణ సూపర్ విజన్ గా, మరో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.

రేవు సినిమా ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు దిల్ రాజు ముఖ్య అతిథిగా వచ్చారు. ట్రైలర్ చూస్తుంటే.. సముద్రం, సముద్రంలో కలిసే రేవు, అక్కడి జాలర్ల కథలా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. కొత్త వాళ్లు కొత్త వాళ్లతో ప్రయోగాలు చేస్తారు కానీ 99 శాతం ఫెయిల్యూర్, వన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది. ఇవాళ ఈవెంట్ కు సీనియర్ జర్నలిస్టులు ప్రభు, పర్వతనేని రాంబాబు ఉండబట్టే నేను వచ్చాను. సినిమాను తీయడం గొప్ప కాదు, ప్రేక్షకుడ్ని థియేటర్ కి రప్పించడం గొప్ప. ఇన్నాళ్లు నా సినిమాలు చూసి వీళ్ళు రివ్యూలు రాశారు. ఇప్పుడు ప్రభు, రాంబాబు సినిమా నిర్మాణంలోకి దిగారు కాబట్టి ఈ సినిమా చూసి నేను రివ్యూ రాస్తాను అని అన్నారు.

Also Read : Ram Charan : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌తో రామ్‌చ‌ర‌ణ్.. భార‌త్‌కు తీసుకురావాల‌ని కోరుతున్న ఫ్యాన్స్‌..!

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. తక్కువ బడ్జెట్‌లోనే, ఉన్న పరిమితులతో సినిమాని అద్భుతంగా తీయవచ్చు అని రేవు సినిమాతో ప్రూవ్ చేసారు. నేను సినిమా చూసి నచ్చడంతో ఈ సినిమా రిలీజ్ లో భాగమయ్యను. సెన్సార్ వాళ్లు కూడా ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు అని తెలిపారు. నిర్మాత మురళీ మాట్లాడుతూ.. ఈ సినిమాని జర్నలిస్టులు రాంబాబు, ప్రభు నాకు చూపించారు. ఈ సినిమా నచ్చడంతో రేవు సినిమాని నేను రిలీజ్ చేస్తున్నాను. ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అడగ్గదు వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. ఆగస్టు 23న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

Revu Movie Trailer Launched By Producer Dil Raju

నిర్మాత డీఎస్ రావు మాట్లాడుతూ.. ‘మత్స్యకారుల జీవితం మీద తీసిన ఈ సినిమా తీయడమే ఒక ఛాలెంజ్. ఇది చాలా డిఫరెంట్ సినిమా అని అన్నారు. సీనియర్ నటుడు రేలంగి నర్సింహారావు మాట్లాడుతూ.. రేవు లాంటి మంచి కథను మురళీ గారు, రాంబాబు, ప్రభు జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొత్త వాళ్లంతా కలిసి అద్భుతంగా ఈ సినిమాను తీశారు అని అన్నారు.