Rishab Shetty: కాంతార తరువాత మరో పాన్ ఇండియా మూవీపై రిషబ్ కన్ను..?

కన్నడ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను కన్నడలో తెరకెక్కించి రిలీజ్ చేయగా, అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పట్టం కట్టారు.

Rishab Shetty Eyeing An Another Pan India Movie After Kantara

Rishab Shetty: కన్నడ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను కన్నడలో తెరకెక్కించి రిలీజ్ చేయగా, అక్కడ ఈ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పట్టం కట్టారు.

Rishab Shetty : దయచేసి ఆ శబ్దాలని అనుకరించకండి.. కాంతార సినిమా చూసిన వాళ్లకి రిషబ్ శెట్టి విజ్ఞప్తి..

ఫలితంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా రిషబ్ శెట్టి నేషనల్ మీడియా చూపుల్లో పడిపోయాడు. ఇక రీసెంట్‌గా కాంతార మూవీ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ఇప్పుడు అందరూ రిషబ్ శెట్టి చేయబోయే నెక్ట్స్ మూవీ ఏమిటని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, రిషబ్ తన నెక్ట్స్ మూవీ కోసం ఇప్పటికే ఓ సబ్జెక్ట్‌ను అనుకున్నాడని.. దీన్ని ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని చూస్తున్నాడట.

Rishab Shetty: ప్రశాంత్ నీల్, రష్మిక చేసినట్టు మీరు చేయకండి.. రిషబ్ శెట్టిని రిక్వెస్ట్ చేస్తున్న కన్నడిగులు..

కాంతార సినిమాతో వచ్చి ఇండియన్ బాక్సాఫీస్‌ను దడదడలాడించిన రిషబ్ శెట్టి ఈసారి ఎలాంటి కథతో వస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు.