Suriya-Vijay : సూర్య ఈవెంట్లో విజయ్ కి ఎలివేషన్ ఇచ్చిన దర్శకుడు.. ఫ్యాన్స్ విమర్శలు..
సూర్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆర్జే బాలాజీ విజయ్ ప్రస్తావన తెచ్చారు. (Suriya-Vijay)
Rj Balaji Comments On Vijay In Suriya Veerabhadrudu Pre Release Event
Suriya-Vijay : సూర్య నటించిన కరుప్పు సినిమా మే 14న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాని వీరభద్రుడు పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా వీరభద్రుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి సూర్య రాగా కార్తీ గెస్ట్ గా హాజరయ్యాడు.
ఈ సినిమా నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆర్జే బాలాజీ కూడా హాజరయ్యారు. అయితే ఇటీవల స్టార్ హీరో విజయ్ తమిళనాడు ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆర్జే బాలాజీ విజయ్ ప్రస్తావన తెచ్చారు.
Also See : Patas Praveen : జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ పెళ్లి.. హల్దీ వేడుకల ఫోటోలు షేర్ చేసిన భార్య..
ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం వరకు ఆయన మీద తమిళనాడులో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి జనాల్లో. అతన్ని ఎవరూ నమ్మలేదు. చాలా మంది ఆయనపై నెగిటివ్ చేసారు. క్రూరంగా ప్రవర్తించారు. నెగిటివ్ ప్రచారం చేశారు ఆయనపై. కానీ ఆయనపై ఆయనకు నమ్మకం ఉంది. ఆయన కలలు, ఆయన ఆలోచనలు, ఆయన ముందు చూపుతో వెళ్లారు. ఇవాళ ఆయన తమిళనాడుకు చీఫ్ మినిష్టర్ అయ్యారు. ఇవాళ ఆయన గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి. కానీ రెండేళ్ల క్రితం ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. ఆయనకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది బాగా చేస్తాను అని. ఆ నమ్మకమే తమిళనాడు ప్రజలు నమ్మి ఓట్లు వేశారు.
ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణగా ఉన్నారు. మనల్ని మనం నమ్మితే అది శక్తిగా మారుతుంది అనడానికి వీళ్ళిద్దరూ ఉదాహరణ. వాళ్ళ లాగే నన్ను నేను నమ్ముతాను. ఒక ఆర్జేగా మొదలయి నటుడిగా మారి ఇవాళ దర్శకుడు అయ్యాను అని అన్నారు. అయితే సూర్య సినిమా ఈవెంట్లో విజయ్ ప్రస్తావన తెచ్చి సీఎం అయ్యాడు అని ఎలివేషన్స్ ఇవ్వడంతో సూర్య ఫ్యాన్స్ హార్ట్ అయి విమర్శలు చేస్తున్నారు. సాధారణంగానే కొంతమంది ఫ్యాన్స్ కి తమ హీరో ముందు ఇంకో హీరోని పొగిడితే నచ్చదు. ఇలా విజయ్ సీఎం అయినా విషయాన్ని సూర్య ముందు ఎలివేషన్ ఇచ్చి చ్ప్పడంతో ఆ మ్యాటర్ ఇక్కడ అవసరమా అంటున్నారు. సినిమా ఈవెంట్స్ లో రాజకీయాలు ఎందుకు అని మరోసారి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ హీరోలు అంతా బాగానే ఉంటారు. విజయ్ ని పొగిడినప్పుడు సూర్య చప్పట్లతో అభినందించారు. విజయ్ ఎన్నికల్లో గెలిచాక కూడా సూర్య ఆయన్ని అభినందిస్తూ ట్వీట్ చేసారు.
Also Read : Suriya : ఆ నటుడి ఇంట్లో దొంగతనం చేసిన సూర్య.. హెల్ప్ చేసిన కార్తీ..
