SaarangaDariya: 1952లోనే పుస్తకాల్లోని పాటకు ఇప్పుడు హక్కుదారులా

జానపద గీతానికి హక్కుదారులెవరు..? ముందుగా టీవీలో పాడిన వాళ్లకే హక్కులు దక్కుతాయా..? వేరే ఎవరు పాడిన కాపీ కొట్టినట్టేనా..? అసలు ఏ జానపద గీతమైనా..

SaarangaDariya: జానపద గీతానికి హక్కుదారులెవరు..? ముందుగా టీవీలో పాడిన వాళ్లకే హక్కులు దక్కుతాయా..? వేరే ఎవరు పాడిన కాపీ కొట్టినట్టేనా..? అసలు ఏ జానపద గీతమైనా ఒరిజినల్ రూపంలోనే ఉండిపోదు. ప్రాంతాలు, సంస్కృతులు, కాలానికి అనుగుణంగా మారుతూనే ఉంటుంది… ఒక తరం నుంచి మరోతరానికి అలా సజీవనదిలా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి జానపదాలకు హక్కుదార్లు.. ప్రజలే, సమాజమే, ఎవరు పాడితే వాళ్లే…

సారంగదరియా, ఏజెంటు రైక అంటే ఏంటి.. అనే ప్రశ్నల మీద బోలెడు నడిచిన చర్చలు పాటపై ఫోకస్ ను పెంచాయి. సుద్దాల కూడా యథాతథంగా ఆ పాటను స్వీకరించకుండా… పల్లవి తీసుకుని, మిగతా భాగం సినిమాకు పనికొచ్చేలా రాశారు.

Sai Pallavi

ఓ మిత్రుడి నుంచి వచ్చిన వాట్సప్ సందేశంలో ఒక పాత పుస్తకంలోని 129వ పుట… పాత జానపదాలను వింటూ, రాసుకుంటూ, అక్షరబద్ధం చేసిన ఎవరో రచయిత శ్రమ, అభిరుచి, ప్రయాస, జిజ్ఞాస గురించి చెప్పాడు. ఉదహరణగా ఆ పేజీలను కూడా పంపాడు. నిజానికి పాపులర్ జానపదాల్ని రికార్డు చేయడం, వాటిని సంరక్షించడం గొప్ప పని.

రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగదరియా అనే జానపదాన్ని 1952లోనే నల్గగొండ జిల్లా, నకిరెకల్లు గ్రామంలో ఫలానా వాళ్లు చెబుతుంటే రాసుకున్నానని కూడా రచయిత స్పష్టంగా పేర్కొన్నాడు. సరసమైన జానపదాల్ని విడిగా శృంగార గీతాలు విభాగం కింద వర్గీకరించి, పొందుపరిచినట్టున్నారు. ఈ పుస్తకం పేరేమిటో, రచయిత పేరేమిటో మొదట సరిగ్గా తెలియరాలేదు.

సారంగదరియా 70 ఏళ్ల క్రితమే జనం నోళ్లలో నానిందని చెప్పడానికి ప్రబలమైన ఉదాహరణ. పుస్తకం పేరు తెలంగాణ పల్లె పాటలు, రచయిత బిరుదరాజు రామరాజు అని సమాచారం. ఈ సారంగదరియాకు అసలైన హక్కుదారులెవరో… ఇంకేదో కొత్తదనం కనిపించేవరకూ… సారంగదరియా, నర్సపల్లే, ఆగం చేసిందిరో వంటి పాటలదే రాజ్యం… కానివ్వండి…

ట్రెండింగ్ వార్తలు