Naga Chaitanya – Sai Pallavi : లవ్ స్టోరీలో సాయి పల్లవి, నాగచైతన్యకి నిజంగానే ముద్దు పెట్టిందా..!

లవ్ స్టోరీలో సాయి పల్లవి, నాగచైతన్యకి నిజంగానే ముద్దు పెట్టిందా. ఆమె ఏం చెప్పారు..?

Naga Chaitanya – Sai Pallavi : లవ్ స్టోరీలో సాయి పల్లవి, నాగచైతన్యకి నిజంగానే ముద్దు పెట్టిందా..!

Sai Pallavi is really kissed Naga Chaitanya in love story movie

Naga Chaitanya – Sai Pallavi : నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2021లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో చైతన్య అండ్ పల్లవి మధ్య పెద్ద రొమాంటిక్ సన్నివేశాలు ఏమి లేకపోయినా.. స్క్రీన్ పై వీరిద్దరి జంట ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయితే మూవీలో ఒక ముద్దు సీన్ ఉంటుంది. ఆ సీన్ లో సాయి పల్లవి, చైతన్యకి లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఆ ముద్దు ఇచ్చిన తరువాత చైతన్య.. కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక ఈ సీన్ తెరకెక్కించడానికి శేఖర్ కమ్ముల బాగా కష్టపడ్డారని, ఆ సన్నివేశంలో చైతన్యతో సరైన ఎక్స్‌ప్రెషన్ పలికించడం కోసం బాగా టైం పట్టిందని.. ఒక వార్త ఎప్పటినుంచో వినిపిస్తూ వస్తుంది. ఇక ఈ వార్త పై సాయి పల్లవి ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఆ సన్నివేశం.. ‘నాగచైతన్య వల్ల ఆలస్యం అవ్వలేదని, తన వల్లే లేటు అయ్యిందని’ సాయి పల్లవి చెప్పుకొచ్చారు.

Also read : SSMB29 : మహేష్, రాజమౌళి సినిమా 2025లోనే షూటింగ్‌కి వెళ్తుందా.. నిర్మాత ఏం చెప్పాడు..!

అసలు విషయం ఏంటంటే.. సాయి పల్లవికి నో కిస్ పాలసీ ఉంది. ఆమె ముద్దు పెట్టారు, కేవలం ముద్దు పెట్టినట్లు మాత్రమే నటిస్తారు. దీంతో ఆ ఆ ఫేక్ ముద్దుని రియల్ గా చూపించడం కోసం బాగా లేటు అయ్యిందట. శేఖర్ కమ్ముల, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్.. కెమెరా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పెట్టి చూసుకొని చిత్రీకరించాల్సి వచ్చిందట. అందుకనే ఆ సీన్ చేయడానికి చాలా సమయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by 𝗦 𝗔 𝗜 𝗣 𝗔 𝗟 𝗟 𝗔 𝗩 𝗜 ❤ (@sai_pallavi__fc)

కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు.. ‘తండేల్’ సినిమాలో మరోసారి కలిసి నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. రియల్ ఇన్సిడెంట్స్ తో యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ ఏడాది దసరాకి మూవీని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.