Samantha : గాయపడ్డ సమంత.. ఈ కష్టానికి అయినా ఫలితం వస్తుందా..?
సమంత మా ఇంటి బంగారం సినిమా కోసం ఇంత కష్టపడింది, గాయపడింది దానికి తగ్గ ఫలితం వస్తుందా అని చర్చిస్తున్నారు. (Samantha)
Samantha
Samantha : సమంత చాన్నాళ్ల తర్వాత మెయిన్ లీడ్ లో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా మా ఇంటి బంగారం తో జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సమంత యాక్షన్ చేయడం, చాలా గ్యాప్ తర్వాత వస్తుండటంతో ఈ సినిమాపై కాసిన్ని అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తుంది సామ్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాను అని చెప్పుకొచ్చింది.
సమంత మాట్లాడుతూ.. మా ఇంటి బంగారం సినిమాలో స్లో మోషన్ సీక్వెన్స్‌లు, గాల్లో ఎగిరే షాట్లు, అనవసరమైన బిల్డప్ షాట్స్ ఉండవు. అన్ని సహజంగానే ఉంటాయి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని నిజమైనవి. ఎలాంటి డూప్ లేకుండానే చేశాను. ఎంత కష్టమైనా యాక్షన్ సీక్వెన్స్ లో నేనే నటించాను. యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తున్నపుడు నాకు చాలా దెబ్బలు తగిలాయి. రక్తం కూడా వచ్చింది. అందుకే ఈ సీన్స్ సహజంగా వచ్చాయి. అందరికి ఆ యాక్షన్ సీక్వెన్స్ లు నచ్చుతాయి అని తెలిపింది.
Also Read : Kenatha Kanom Review : ‘కెనాథ కానోమ్’ మూవీ రివ్యూ.. బావి కోసం తవ్వుతుంటే డైనోసార్ బయటపడితే ఏం జరిగింది..?
మరి సమంత మా ఇంటి బంగారం సినిమా కోసం ఇంత కష్టపడింది, గాయపడింది దానికి తగ్గ ఫలితం వస్తుందా అని చర్చిస్తున్నారు. గత కొన్నాళ్లుగా సమంత ఒక్క కమర్షియల్ హిట్ కూడా చూడలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది సమంత. సమంత చివరగా 2019 లో సూపర్ డీలక్స్, మజిలీ, ఓ బేబీ.. మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ఇక అప్పట్నుంచి సమంత హిట్ మాటే వినలేదు.
2019 చివర్లో నాగార్జున మన్మధుడు 2 సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయింది. 2020లో తమిళ్ 96 సినిమా రీమేక్ జానులో నటించింది. ఆ సినిమాలో సమంత నటనకు అభినందనలు వచ్చినా సినిమాకు కలెక్షన్స్ రాలేదు. తమిళ్ లో నయనతారతో కలిసి కాత్తువకుల రెండు కాదల్ సినిమా చేసింది. ఆ సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది. యశోద అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చినా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసినా అది కూడా ఫ్లాప్ అయింది. ఇలా దాదాపు ఆరేళ్లుగా సమంత మెయిన్ లీడ్ లో, హీరోయిన్ గా చేసిన ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు.
Also Read : Vadde Naveen : చిరంజీవి సినిమా తెగ నచ్చేసింది.. రీ ఎంట్రీలో అలాంటి సినిమాలే కావాలంటున్న వడ్డే నవీన్..
సమంత భర్త రాజ్ నిడిమోరు రంగంలోకి దిగి ఈ కథని రాసాడు. మొదట వేరే దర్శకుడు అనుకున్నా సమంత ఫ్రెండ్, సమంతకు ఆల్రెడీ హిట్ ఇచ్చిన నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది. మరి ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత సమంత మెయిన్ లీడ్‌లో నటిస్తూ నిర్మించిన మా ఇంటి బంగారం సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
