Samantha : బాలీవుడ్‌లో ‘సిటాడెల్’ సిరీస్‌కి సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..? కెరీర్‌లోనే హైయెస్ట్..

సాధారణంగా సౌత్ లో కంటే బాలీవుడ్ లో రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే చాలామంది హీరోయిన్స్ ఇక్కడ పేరు తెచ్చుకున్నాక బాలీవుడ్ కి చెక్కేస్తారు. ఇదే కోవలో సమంత కూడా.

Samantha : బాలీవుడ్‌లో ‘సిటాడెల్’ సిరీస్‌కి సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..? కెరీర్‌లోనే హైయెస్ట్..

Samantha Remuneration for Bollywood Citadel Series goes Viral

Samantha : సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్యంపై ఫోకస్ చేస్తూ బిజినెస్ లు చూసుకుంటూ, హెల్త్ పాడ్ కాస్ట్ లు చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బిజీగానే ఉంది సమంత. సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ రాకముందు బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘సిటాడెల్’ సిరీస్ కూడా చేసింది.

ఆ సిటాడెల్(Citadel) సిరీస్ ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ హనీ బన్నీ అనే టైటిల్ తో ఆ సిరీస్ రాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే అమెజాన్ ఈవెంట్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. అయితే ఈ సిరీస్ కి సంబంధించి ఓ ఆసక్తికర టాక్ నడుస్తుంది. సమంత ఈ సిరీస్ కి తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

సాధారణంగా సౌత్ లో కంటే బాలీవుడ్ లో రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే చాలామంది హీరోయిన్స్ ఇక్కడ పేరు తెచ్చుకున్నాక బాలీవుడ్ కి చెక్కేస్తారు. ఇదే కోవలో సమంత కూడా. సమంత టాలీవుడ్ లో ఒక సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేది సమాచారం. పుష్పలో ఒక్క ఐటెం సాంగ్ కి మూడు కోట్లు తీసుకుందని, అది చాలా హైయెస్ట్ అని ఆ సమయంలో వార్తలు వచ్చాయి.

Also Read : Karthika Deepam : సీరియల్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ‘కార్తీక దీపం’ అంటే ఆమాత్రం ఉంటుందిలే..

అయితే బాలీవుడ్ లో సిటాడెల్ లో మెయిన్ లీడ్ గా చేసినందుకు సమంతకు పది కోట్లు ఇచ్చారని తెలుస్తుంది. సిటాడెల్ సిరీస్ కి గాను సమంత తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ 10 కోట్లు తీసుకుందని సమాచారం. దీంతో ఒక్క సిరీస్ కి మరీ అంతా అంటూ ఆశ్చర్యపోతున్నారు అంతా.