Samantha : సమంత ఆయుర్వేదం చికిత్స.. ఏ దేశంలో తీసుకుంటుందో తెలుసా?

తాజాగా సమంత భూటాన్ వెళ్ళింది. భూటాన్ లో సరికొత్త ఆయుర్వేదం చికిత్స ట్రై చేస్తుంది సమంత.

Samantha : సమంత ఆయుర్వేదం చికిత్స.. ఏ దేశంలో తీసుకుంటుందో తెలుసా?

Samantha Trying Bhutan Ayurvedam Treatment for Health

Samantha : సమంత సినిమాలకు బ్రేక్ ప్రకటించిన తర్వాత తన మయోసైటిస్(Myositis) చికిత్స కోసం, తన ఆరోగ్యం కోసం దేశాలు తిరిగేస్తుంది. అటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే మరో పక్క ఆయుర్వేదంతో పాటు రకరకాల కొత్త వైద్యాలను కూడా చేయించుకుంటుంది సమంత. అలాగే మనసు ఆహ్లాదం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దగ్గర్నుంచి సమంత కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, బాలి, అమెరికా, ఆస్ట్రియా, ఇటలీ.. లాంటి పలు ప్రదేశాలు తిరిగింది.

ప్రతి చోట ఏదో ఒక ప్రకృతి వైద్యం, కొత్త రకాల వైద్యం కూడా ట్రై చేసింది సమంత. ఇటీవలే క్రయోథెరపీ(Cryotherapy) అనే ఓ వైద్యాన్ని కూడా తీసుకుంది. తాజాగా సమంత భూటాన్ వెళ్ళింది. భూటాన్ లో సరికొత్త ఆయుర్వేదం చికిత్స ట్రై చేస్తుంది సమంత. భూటాన్(Bhutan) ఆయుర్వేదంలో హాట్ స్టోన్ బాత్ అనే ఓ చికిత్సను సమంత తీసుకుంటుంది. దానికి సమందించిన ఫొటోలు, వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంది.

పలు ఫొటోలు షేర్ చేసి.. గతంలో భూటాన్ – భారత్ కు మధ్య మంచి సంబంధాలతో ఆచార సంప్రదాయాలు, జ్ఞానాన్ని షేర్ చేసుకున్నారు. అప్పుడే ఆయుర్వేదం కూడా పంచుకున్నారు. టిబెట్ ఆయుర్వేదంలో ఈ హాట్ స్టోన్ బాత్ బాగా పాపులర్. ఇండియా నుంచి వచ్చిన ఆయుర్వేద పద్దతుల నుంచే దీన్ని కనిపెట్టారు. ఇక్కడ ఉన్న హాట్ టబ్ వాటర్ లో ఇక్కడ స్టోన్స్ కరిగి వాటికి ఉన్న శక్తిని ఈ నీళ్లకు అందచేస్తాయి. దీన్ని డాట్ షో అని కూడా అంటారు. అలాగే ఇందులో కెంపా అనే మూలికలు కూడా వాడతారు. ఆ స్టోన్స్, మూలికలు ఈ హాట్ వాటర్ లో కరిగి వాటి శక్తి నీళ్లకు అందగా దీంట్లో స్నానం చేయడం వల్ల మనలో ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. ఇలాంటివి అన్ని మాయం అవుతాయి అంటూ తాను తీసుకుంటున్న చికిత్స గురించి తెలిపింది సమంత.

Samantha Trying Bhutan Ayurvedam Treatment for Health

Also Read : Balakrishna : అదిరిపోయే NBK109 అప్డేట్.. గొడ్డలికి కళ్ళజోడు పెట్టి..

ఇక భూటాన్ లో సమంత ఈ ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటూనే మరో పక్క అక్కడి చేనేత పరిశ్రమలు, అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలు సందర్శిస్తుంది. ఇలా దేశాలు తిరిగేస్తున్న సమంత భూటాన్ తర్వాత ఏ దేశం వెళ్తుంది చూడాలి.