Satyadev : మహేష్ బాబు సినిమాలో నటించి అలా జరిగినందుకు బాధపడ్డాను.. ఇప్పుడు కట్ చేస్తే.. సత్యదేవ్ వ్యాఖ్యలు వైరల్..
ఈ క్రమంలో మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Satyadev)
Satyadev
Satyadev : సత్యదేవ్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి వచ్చి మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. నటుడిగా సత్యదేవ్ ఎన్నో అభినందనలు తన ప్రతి సినిమాకు తెచ్చుకుంటున్నాడు. సత్యదేవ్ ఇప్పుడు రావు బహదూర్ సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని, సత్యదేవ్ కూడా తన నటన పరంగా మూడు పాత్రల్లో కనిపించి మెప్పించబోతున్నాడని తెలుస్తుంది.
ఈ రావు బహదూర్ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగస్వామి అయ్యారు. ఆల్రెడీ ఈ సినిమా చూసి తన సోషల్ మీడియాలో రావు బహదూర్ లాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకు రాలేదు అంటూ ట్వీట్ వేశారు. ట్రైలర్ కి మహేష్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.
Also Read : Ameer Log : రానా రిలీజ్ చేస్తున్న మరో చిన్న సినిమా.. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ‘అమీర్ లోగ్’
జులై 3న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా నేడు సత్యదేవ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సత్యదేవ్ మాట్లాడుతూ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నేను నటించాను. మహేష్ బాబు ఫ్రెండ్ పాత్రలో అక్కడక్కడా కనిపిస్తాను. మహేష్ నా మీద చెయ్యి వేసి మాట్లాడే సీన్స్ ఉంటాయి. రిలీజ్ కి ముందే మహేష్ నా మీద చెయ్యి వేసి సీన్స్ ఉన్నాయని అందరికి చెప్పుకున్నాను. తీరా చూస్తే సినిమాలో ఆ సీన్స్ ఎడిటింగ్ లో తీసేసారు. అందరూ నన్ను సినిమాలో మహేష్ పక్కన ఉన్నావన్నావు, చెయ్యి వేసాడు అన్నావు ఎక్కడ అని ఎగతాళి చేసారు. అప్పుడు బాధపడ్డాను. ఇన్నేళ్ల తర్వాత నా సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా మారడం, నా సినిమా చూసి మహేష్ పొగడటం అనేది రియల్ సక్సెస్ అని నేను నమ్ముతాను అన్నారు. దీంతో సత్యదేవ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
