Rambha: రంభ తండ్రి కన్నుమూత.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరోయిన్
సౌత్ సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ (Rambha)తండ్రి కన్నుమూశారు.
Senior heroine Rambha father passed away
Rambha: ఒకప్పటి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రంభ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో రంభ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. రంభ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగే క్రమంలో ఆమె తండ్రి ఎంతో మద్దతుగా నిలిచారు. ఆయన మరణం రంభకు తీరని లోటుగా మిగిలిపోయింది.
Trisha Krishnan: సౌత్ లో త్రిష సెంటిమెంట్.. ‘విశ్వంభర’ బ్లాక్ బస్టర్ గ్యారంటీ… ప్రూఫ్స్ ఇవిగో!
తన తండ్రి మరణంపై రంభ (Rambha)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. “నువ్వు లేకుండా నేను లేను నాన్న.. నా జీవితంలో నువ్వు నింపిన శూన్యాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను” అంటూ భావోద్వేగానికి లోనైంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు రంభకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
