Kamal Haasan: బిగ్‌బాస్ నుంచి కమల్ హాసన్ అవుట్.. కారణం ఇదే!
హిందీలో.. తర్వాత దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్లాక్‌బస్టర్ షో బిగ్‌బాస్.. ఈ షో తమిళ్ వెర్షన్‌కి ప్రముఖ హీరో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
- vamsi
- Published On : February 21, 2022 / 07:15 AM IST
Kamal Haasan: హిందీలో.. తర్వాత దక్షిణాదిలోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్లాక్‌బస్టర్ షో బిగ్‌బాస్.. ఈ షో తమిళ్ వెర్షన్‌కి ప్రముఖ హీరో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కమల్ హాసన్. తన రాబోయే చిత్రం విక్రమ్ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు కమల్ హాసన్.
లాక్‌డౌన్ పరిమితుల కారణంగా “విక్రమ్” సినిమా కోసం నిర్మాణ కార్యకలాపాలను రీషెడ్యూల్ చేయవలసి వచ్చింది. అనివార్య పరిస్థితుల్లో బిగ్ బాస్ కోసం కేటాయించాల్సిన డేట్స్ విక్రమ్ సినిమా కోసం కేటాయించాల్సి వస్తోంది. కొంతమంది స్టార్స్, టెక్నికల్ పర్సన్స్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలను పూర్తి చేయడానికి మరికొన్ని రోజులు విక్రమ్ షూటింగ్ కోసం కేటాయించాల్సి వస్తుంది.
ఇటువంటి సమయంలో బిగ్ బాస్, విక్రమ్ షూటింగ్ రెండింటినీ కలిపి నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తోంది. స్టార్ యాక్టర్స్, టెక్నికల్ పర్సన్స్‌ని నా కోసం వెయిట్ చేయించడం కరెక్ట్ కాదనే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందువల్లే బిగ్‌బాస్ ఈ సీజన్ నుండి వైదొలగవలసి వచ్చింది అని కమల్ హాసన్ చెప్పారు.
ஒரு சிறிய இடைவேளைக்குப் பிறகு.
After a short break. pic.twitter.com/NfbUMz1GjY
— Kamal Haasan (@ikamalhaasan) February 20, 2022
