‘‘కలలు చూసినా కన్నులే.. నేడు మోసెనే కన్నీళ్లే’’.. ఆకట్టుకుంటున్న హార్ట్ టచింగ్ సాంగ్..
- sekhar
- Published On : July 18, 2020 / 12:01 PM IST
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధా మోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధా మోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా’.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ‘కలలు చూసినా కన్నులే.. నేడు మోసెనే కన్నీళ్లే’ అనే లిరికిల్ సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
‘‘కలలు చూసినా కన్నులే.. నేడు మోసెనే కన్నీళ్లే… హాయి పంచినా.. గుండెకే ఓ గాయమయ్యెనే.. ఓహో జంట నడిచినా అడుగులే.. ఒంటరయ్యెనే ఇవ్వాలే.. వెలుగు నిచ్చినా నీడకే మిగిలింది చీకటే’’.. అంటూ అర్థవంతంగా మనసుకు హత్తుకునే ఈ విరహగీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ అంతే అద్భుతంగా ఆలపించారు.
