రూమర్స్‌కి చెక్.. సింగర్ సునీత నిశ్చితార్థం!
- sekhar
- Published On : December 7, 2020 / 01:16 PM IST
Singer Sunitha gets engaged: సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. డిజిటల్ మీడియాలో కీలకపాత్ర పోషిస్తున్న రామ్ వీరపనేనితో సునీత నిశ్చితార్థం సోమవారం జరిగింది.
అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు (పాప-బాబు) పుట్టిన తర్వాత కొంతకాలానికి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కెరీర్ కొనసాగిస్తూనే పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారామె.
కాగా గతకొద్ది రోజులుగా సునీత రిలేషన్ గురించి, రెండో పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నిశ్చితార్థంతో ఆ వార్తలకు చెక్ పడింది. ఓ ప్రముఖ దర్శకుడు ఈ సంబంధం కుదిర్చినట్లు సమాచారం.
