నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా మగ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా మగ ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్.. ‘‘ఇంటర్నేషనల్ మెన్స్ డే నాడు షూటింగ్ ప్రారంభమైంది.. 2020 మే డే రోజు నుంచి ఫ్రీడం కోసం ఫైట్ స్టార్ట్ కానుంది’’ అంటూ తేజు లొకేషన్లోకి ఎంటర్ అవుతున్న వీడియో షేర్ చేశారు. 2020 మే 1న ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల కానుంది.
మారుతి దర్శకత్వంలో తేజు, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి సంగీతం : థమన్, కెమెరా : వెంకట్ సి దిలీప్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా.