Sonu Sood: ఆదుకొమ్మని మెహర్ రమేష్ ట్వీట్… అక్కర తీర్చిన సోనూసూద్
మీ ప్రాణాలకు నేను అండగా ఉంటానంటూ వీలైనంత వరకూ ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్న సోనూ.. మరో హెల్ప్ చేసి ఇంకో కుటుంబాన్ని కాపాడాడు.
- Subhan Ali Shaik
- Published On : May 9, 2021 / 10:09 AM IST
Sonu Sood
Sonu Sood: ఆపద్భాందవుడు.. కరోనా మహమ్మారి పేరు వినిపిస్తే ఎంత భయం వేస్తుందో.. సోనూసూద్ గురించి తెలియగానే అంత ధైర్యం వస్తుంది. సమస్య ఎలాంటిదైనా, మీ ప్రాణాలకు నేను అండగా ఉంటానంటూ వీలైనంత వరకూ ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్న సోనూ.. మరో హెల్ప్ చేసి ఇంకో కుటుంబాన్ని కాపాడాడు.
తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెంకట రమణ అనే పేషెంట్ కోసం కొన్ని ఇంజక్షన్స్, మెడిసిన్స్ కావాలని కోరాడు. ఎంతగా ప్రయత్నించినా అవి సమకూర్చలేకపోయానని, దయచేసి ఆ పేషెంట్‌కి అందేలా చేయాలని ట్విట్టర్ ద్వారా కోరాడు. ఈ ట్వీట్ చేసిన 24 గంటలలో.. సోనూసూద్ ఆ మెడిసిన్స్‌ను దర్శకుడు మెహర్ రమేష్ అందజేశారు.
Tocilizumb 400 mg ఇంజక్షన్‌ను శుక్రవారం వైజాగ్‌లో ఇదే 12 లక్షల వరకూ అమ్ముడుపోతుంది. కావాలంటే మీకు రూ.5లక్షలకు ఇస్తామని వెంకట రమణ పేషెంట్ తాలూకా వారికి చెప్పారట. నిజానికి దీని ధర బయట 40 వేలు. దాని కొరత ఉండటంతో ఇష్టానుసారంగా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.
బ్లాక్‌లో కొనే స్థోమత లేని వారి పరిస్థితి అంతే. ఇటువంటి పరిస్థితుల్లో అడిగిన వెంటనే అంత విలువ చేసే ఇంజక్షన్స్, మెడిసిన్స్ సోనూసూద్ ఉచితంగా వెంకట రమణకు అందేలా చేశారు. సోనూసూద్ చేసిన సహాయానికి మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనుసూద్ ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు కంటిన్యూగా సహకారం అందిస్తూనే ఉన్నారు.
