Bharateeyudu 2 : ఆ పాట కోసం భారతీయుడు 2 సినిమాకు వెళ్తే.. అసలు ఆ పాటే లేదుగా..

భారతీయుడు 2 సినిమాలో రెండే పాటలు ఉన్నాయి. శౌరా సాంగ్ సినిమాలో లేకపోవడంతో ఈ పాట అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Bharateeyudu 2 : ఆ పాట కోసం భారతీయుడు 2 సినిమాకు వెళ్తే.. అసలు ఆ పాటే లేదుగా..

Souraa song not played in Bharateeyudu 2 Movie Audience Disappointed

Bharateeyudu 2 : కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా నిన్న జులై 12న రిలీజవ్వగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు హిట్ అయినా భారతీయుడు సినిమాకు సీక్వెల్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను భారతీయుడు 2 అందుకోలేకపోయింది. ఈ సినిమాకి మ్యూజిక్కే పెద్ద మైనస్. సినిమా ముందే మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా ఒక సాంగ్ లో మధ్యలో వచ్చే ఒక్క బిట్ మాత్రం బాగా వైరల్ అయింది.

భారతీయుడు 2 నుంచి సినిమా రిలీజ్ కి ముందు విడుదల చేసిన శౌరా.. సాంగ్ లో మధ్యలో ‘నీ పాద ధూళి మెరుపవుతను నీ యుద్ధ కేళి మరకవుతను.. గుడియా గుడియా నీతో గడిపే గడియా..’ అంటూ మెలోడీగా ప్రేమని వ్యక్తపరిచే లిరిక్స్ వస్తాయి. ఈ సాంగ్ లో ఈ బిట్ అందరికి బాగా నచ్చేసింది. రీల్స్ లో అయితే ఈ పాట బాగా వైరల్ అయింది. బ్రిటిష్ కాలంలో యుద్ధ సమయంలో ఈ పాట వస్తుందని లిరిక్ సాంగ్ చూస్తే అర్ధమవుతుంది. దీంతో కొంతమంది ఈ పాట కోసమే సినిమాకు వెళ్లగా సినిమాలో ఈ పాట లేకపోవడం గమనార్హం.

Also Read : Akshay Kumar : నా సినిమాలు ఫెయిల్ అయితే చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..

భారతీయుడు 2 సినిమాలో రెండే పాటలు ఉన్నాయి. ఈ శౌరా సాంగ్ సినిమాలో లేకపోవడంతో ఈ పాట అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ పాట కోసమే సినిమాకు వెళ్తే ఈ పాట లేదని పోస్టులు చేస్తున్నారు. అయితే సినిమా చివర్లో చూపించిన భారతీయుడు 3 ట్రైలర్ చూస్తే అందులో బ్రిటిష్ వాళ్ళతో యుద్దాలు ఉన్నాయి, ఈ శౌరా సాంగ్ కూడా బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాల సమయంలో ఉన్నట్టే చూపించారు కాబట్టి ఈ పాట భారతీయుడు 3లో ఉండొచ్చు అని తెలుస్తుంది. ఒకవేళ పార్ట్ 3లో ఉంటే ఈ పాట ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారో మరి.