ట్రంప్ ఇండియా టూర్..వర్మ సెటైర్లు

  • Publish Date - February 24, 2020 / 10:09 AM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇండియా టూర్‌పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ..తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు. ఇప్పటికే ఆయన పర్యనటపై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఆసక్తికరమైన ట్వీట్ల మీద ట్వీట్లు సంధించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అయితే..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అమెరికాకు స్వాగతించడానికి అక్కడి వారు వేల రూపాయలైనా ఖర్చ చేస్తారా ? అది అమెరికా..భారత్ కాదు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Read More : అప్పుడూ అదే : ఇవాంక ట్రంప్ ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా!

అసలు ట్రంప్ ఇండియాకు రావడానికి ఓ కారణం ఉందంటూ ట్వీట్ చేశారు. ఇండియా వస్తున్నాడంటే..ఎంతమంది చూడటానికి వస్తారో అని ట్రంప్ ఆసక్తిగా ఉన్నాడని, ఆయన చనిపోయే వరకు గొప్పగా చెప్పుకోవచ్చనే ఉద్దేశ్యమన్నారు. పది మిలియన్ల మంది రావచ్చు..కానీ..ట్రంప్…15 మిలియన్ల ప్రజలు వచ్చారని అబద్ధం చెబుతుదంటూ..సెటైర్ వేశారు వర్మ. 

ఏ భారతీయుడు..సొంత సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తారని తాను అనుకోవడం లేదన్నారు. అలాంటిది ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్లు ఆసక్తిగా చూస్తారని ఆశించడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికంటే..బాలీవుడ్ నైట్ ఈవెంట్ ఏర్పాటు చేయడం ఉత్తమని మరో ట్వీట్స్‌లో తెలిపారు. ఇలా కొన్ని పంచ్‌లు విసిరారు వర్మ.