Sree Vishnu : హీరో శ్రీవిష్ణు భార్య, కూతురుని చూశారా? భార్య బర్త్ డే రోజు స్పెషల్ ఫోటో షేర్ చేసి..

తాజాగా శ్రీవిష్ణు ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది.

Sree Vishnu : హీరో శ్రీవిష్ణు భార్య, కూతురుని చూశారా? భార్య బర్త్ డే రోజు స్పెషల్ ఫోటో షేర్ చేసి..

Sree Vishnu Family Photo with his Wife and Daugter goes Viral

Updated On : August 17, 2024 / 10:44 AM IST

Sree Vishnu : హీరో శ్రీవిష్ణు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కొడుతున్నాడు. సామజవరగమన సినిమాతో కెరీర్ లో మొదటిసారి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాడు. ఆ తర్వాత ఓం భీమ్ బుష్ సినిమాతో ఇంకో హిట్ కొట్టాడు. శ్రీవిష్ణు చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో వస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. త్వరలో స్వాగ్ సినిమాతో రాబోతున్నాడు.

Also Read : Kalki 2898AD : చిరంజీవి పుట్టిన రోజున ఓటీటీలో కల్కి సినిమా.. అధికారిక ప్రకటన..

తాజాగా శ్రీవిష్ణు ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. ఇటీవల శ్రీవిష్ణు భార్య ప్రశాంతి పుట్టిన రోజు కావడంతో భార్య, కూతురు మ్రిదాతో ఉన్న ఫోటో షేర్ చేసి స్పెషల్ గా బర్త్ డే విషెష్ తెలిపాడు. అలాగే ఓ వెకేషన్ నుంచి తన భార్య ఫోటో ఒక్కటే స్పెషల్ గా షేర్ చేసి విషెష్ తెలిపాడు. శ్రీ విష్ణు పోస్ట్ చేసిన ఫోటో చూసి శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో శ్రీవిష్ణు ఫ్యామిలీ ఫొటో వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Sree Vishnu (@sreevishnu29)