Unstoppable With NBK : అన్‌స్టాప‌బుల్ నుండి శ్రీలీల,న‌వీన్ పొలిశెట్టి ఎపిసోడ్ గ్లింప్స్ రిలీజ్..

తాజాగా శ్రీలీల, హీరో న‌వీన్ పొలిశెట్టి ఎపిసోడ్ కి సంబందించిన గ్లింప్స్  రిలీజ్ చేశారు మేకర్స్.

Unstoppable With NBK : అన్‌స్టాప‌బుల్ నుండి శ్రీలీల,న‌వీన్ పొలిశెట్టి ఎపిసోడ్ గ్లింప్స్ రిలీజ్..

Sreeleela Naveen Polishetty episode glimpses release from Unstoppable

Updated On : December 1, 2024 / 7:21 PM IST

Unstoppable With NBK : నందమూరి నటసింహం బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌ షో అన్‌స్టాప‌బుల్. బాల‌య్య హోస్టింగ్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఇప్ప‌టికే మూడు సీజ‌న్లు పూర్తి చేసుకున్న అన్‌స్టాప‌బుల, ఇటీవ‌లే నాలుగో సీజన్ ప్రారంభ‌మైంది. మొద‌టి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌చ్చారు. తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌, హీరో సూర్య‌, నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు.

Also Read : Trisha Krishnan : వామ్మో.. త్రిష మూవీ లైనప్ చూసారా.. సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతుందిగా

అల్లు అర్జున్ ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదల చేశారు. ఇప్పటికీ బన్నీ ఎపిసోడ్స్ ట్రేండింగ్ లోనే ఉన్నాయి. ఇక ఇటీవల త‌రువాతి ఎపిసోడ్‌కు గెస్ట్ గా ఎవ‌రు రానున్నారో రివీల్ కూడా చేసారు టీమ్. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, హీరో న‌వీన్ పొలిశెట్టి వాచినట్టు పలు ఫొటోలు రివీల్ చేశారు. ఇక తాజాగా శ్రీలీల, హీరో న‌వీన్ పొలిశెట్టి ఎపిసోడ్ కి సంబందించిన గ్లింప్స్  రిలీజ్ చేశారు మేకర్స్.


గ్లింప్స్  లో శ్రీలీల తన డాన్స్ తో అదరగొట్టింది. కాసేపు బాలయ్య తనని ఆటపట్టించాడు. వీణ కూడా వాయించి తనలో ఉన్న మరో టాలెంట్ కూడా చూపించింది శ్రీలీల.