Srikanth : శ్రీకాంత్ కూతుర్ని చూశారా.. హీరోయిన్‌లా ఎంత అందంగా ఉందో..

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నేడు కుటుంబసమేతంగా తిరుముల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇక గుడికి శ్రీకాంత్ కూతురు మేధ కూడా వచ్చారు. ఆమెను చూశారా చీరలో ఎంత అందంగా ఉందో..

Srikanth : శ్రీకాంత్ కూతుర్ని చూశారా.. హీరోయిన్‌లా ఎంత అందంగా ఉందో..

Srikanth daughter Medha Meka photo and videos gone viral

Srikanth : టాలీవుడ్ హీరో శ్రీకాంత్.. బడా హీరోల సినిమాల్లో ప్రస్తుతం విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్, ముఖ్య పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఆయన వారసుడు రోషన్.. ‘పెళ్ళిసందD’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. కాగా శ్రీకాంత్ కి రోషన్ కాకుండా మరో కొడుకు రోహన్, కూతురు మేధ ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా నేడు శ్రీకాంత్, ఊహ పిల్లలతో కలిసి కుటుంబసమేతంగా తిరుముల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక అక్కడ శ్రీకాంత్ ఫ్యామిలీని చూసిన జనాలు వారితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించగా.. శ్రీకాంత్ ఫ్యామిలీ కూడా వారికీ సెల్ఫీలు ఇచ్చి ఆనందపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో శ్రీకాంత్ కూతురు ‘మేధ’ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

చీరలో సంప్రదాయపద్ధతిగా అచ్చతెలుగు అమ్మాయిలా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఇక చీరలో మేధ అందం చూసిన మరికొంతమంది ఆమె హీరోయిన్‌లా ఉంది, ఆమె తల్లి ఊహలా ఆమె కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారా..? అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మేధ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి శ్రీకాంత్, ఊహ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు కూడా చూసేయండి.

Also read : Eagle : సంక్రాంతి నుంచి ఈగల్ తప్పుకుంటుందా..? పుట్టినరోజు కోసం చూస్తున్నారా..?