Srinivasa Mangapuram : శ్రీనివాస మంగాపురం.. ఏ ఓటీటీలోకో తెలుసా?
కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటించిన చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram).
Srinivasa Mangapuram ott platform Amazon Prime
Srinivasa Mangapuram : కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటించిన చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). బాలీవుడ్ భామ రాషా తడాని కథానాయిక. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కింది. అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నేడు (జూలై 30, శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అనే విషయం తెలిసిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని టైటిల్ కార్డులో వెల్లడించారు. ఈ చిత్రం రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాతనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
