Sudigali Sudheer : మళ్ళీ బుల్లితెరకు సుడిగాలి సుధీర్.. అలాగే ఓటీటీలో వెబ్ సిరీస్..

మళ్ళీ బుల్లితెరపై షోలు, ఓటీటీలో వెబ్ సిరీస్ తో రాబోతున్నాను అంటూ సుడిగాలి సుధీర్ కామెంట్స్.

Sudigali Sudheer : మళ్ళీ బుల్లితెరకు సుడిగాలి సుధీర్.. అలాగే ఓటీటీలో వెబ్ సిరీస్..

Sudigali Sudheer is come with TV and OTT shows in further days

Sudigali Sudheer : బుల్లితెర పై సూపర్ స్టార్‌డమ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం వెండితెర పై హీరోగా నటిస్తూ వస్తున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్న సుధీర్.. టెలివిజన్ షోలకు ప్రెజెంట్ గ్యాప్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఏ టీవీ షోలో ఆయన కనిపించడం లేదు. దీంతో బుల్లితెర అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. సుధీర్ మళ్ళీ టీవీ షోల్లో ఎప్పుడు కనిపిస్తారు..? సినిమాల్లో నటిస్తూనే టీవీలో కూడా కనిపించండి అంటూ కొందరు అభిమానులు సుధీర్ ని కోరుతున్నారు. మరి ఈ విషయం గురించి సుధీర్ ఏమన్నారు..?

సుధీర్ నటించిన కొత్త సినిమా ‘కాలింగ్‌ సహస్ర’ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా 10TVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నిస్తూ.. “సుధీర్ గారు టీవీ షోల్లో ఎలాగో కనిపించడం లేదు. కనీసం ఓటీటీలో అయినా కనిపించండి. వెబ్ సిరీస్ ఆఫర్లు ఏమన్నా వస్తున్నాయా?” అని ప్రశ్నించారు. దీనికి సుధీర్ బదులిస్తూ.. “వెబ్ సిరీస్ ఆఫర్స్ వచ్చాయండి. కానీ ప్రస్తుతం ఓకే చేసిన సినిమా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో వాటికీ ఓకే చెప్పలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Sudigali Sudheer : రష్మీతో మూవీ కోసం కథ వింటున్నా..

అలాగే టీవీ షోలను వదిలేయలేదని, త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఒకటి రెండు షోలకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కామెంట్స్ బుల్లితెర ఆడియన్స్ కి సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇక ‘కాలింగ్‌ సహస్ర’ విషయానికి వస్తే.. ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అరుణ్‌ విక్కిరాలా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డాలీషా హీరోయిన్ గా నటించారు. డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.