Gorre Puranam : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సుహాస్.. మరో కొత్త సినిమా ‘గొర్రె పురాణం’ రిలీజ్ డేట్ అనౌన్స్..

సుహాస్ హీరోగా ఒక గొర్రె కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Gorre Puranam : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సుహాస్.. మరో కొత్త సినిమా ‘గొర్రె పురాణం’ రిలీజ్ డేట్ అనౌన్స్..

Suhas Gorre Puranam Movie Release Date Announced

Gorre Puranam : బ్యాక్ టు బ్యాక్ హీరోగా మంచి కంటెంట్ సినిమాలతో వచ్చి హిట్లు కొడుతున్న సుహాస్ తాజాగా మరో సినిమాతో రాబోతున్నాడు. సుహాస్ జనక అయితే గనక సినిమా సెప్టెంబర్ 13 రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో ఆ సినిమా వాయిదా పడింది. అయినా అతన నెక్స్ట్ సినిమాని రిలీజ్ కి రెడీ చేసాడు. ‘గొర్రె పురాణం’ అనే కొత్త కథతో సుహాస్ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Also Read : Devara Trailer : ‘దేవర’ ట్రైలర్ అప్డేట్.. దేవర & వర ఇద్దరూ వస్తున్నారు.. రేపు ట్రైలర్ రిలీజ్ ఎన్నింటికి అంటే..?

సుహాస్ హీరోగా ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వం లో ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో ఈ ‘గొర్రె పురాణం’ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గతంలో టీజర్ రిలీజ్ చేయగా మంచి ఆసక్తి నెలకొంది.

Suhas Gorre Puranam Movie Release Date Announced

ఒక గొర్రె కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఒక ఊళ్ళో హిందూ ముస్లింల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది, ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు అని ఆసక్తికర కథతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో గొర్రెకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతున్న ఈ గొర్రె పురాణం సినిమా ప్రమోషన్స్ తాజాగా మొదలుపెట్టారు.