Sundeep Kishan : సందీప్ కిషన్ కొత్త సినిమా ఓపెనింగ్.. ముగ్గురు హీరోయిన్స్‌తో..
నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. (Sundeep Kishan)
Sundeep Kishan
Sundeep Kishan : సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కరికాల’. ఇటీవల ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ యోధుడుగా కనిపిస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేసి టైటిల్ ప్రకటించారు. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కరికాల మొదటి చాప్టర్ 2027 జూలై 2న, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మూవీ యూనిట్ అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి స్క్రిప్ట్‌ను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం మూవీయూనిట్ మీడియాతో మాట్లాడింది.
Also Read : Singer Sunitha : తమిళనాడు ఆలయాల సందర్శనలో సింగర్ సునీత.. సాంప్రదాయ ఫోటోలు..
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ ఆదికి థాంక్స్ చెప్పాలి. ఆది శంబాల వల్లే వీళ్లంతా పరిచయం అయ్యారు. కథ చెప్పడమే రెండు పార్టులుగా ఉంటుందని వివరించారు. కథ నాకు ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు. ఆరేడు నెలలుగా మా దర్శకుడు 24 గంటలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగానే ఉన్నారు. కరికాల నా కెరీర్ బెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను అని తెలిపారు. దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ.. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు, నాపై నమ్మకం పెట్టుకుని సినిమాకి ఓకే చెప్పిన సందీప్ కిషన్ గారికి థాంక్స్. అందమైన చందమామ కథలా ఈ సినిమా ఉంటుంది. అందమైన ఊహా ప్రపంచం, నాగలోకం, వానర లోకం.. ఇలా ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతోన్నాం అని తెలిపారు.

నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ.. వచ్చే వారం నుంచి మూవీ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. యుగంధర్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించబోతోన్నారు అని తెలిపారు. కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత ఓ సినిమా గురించి, నా పాత్ర గురించి ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. యుగంధర్ గారు ఈ ప్రపంచాన్ని నిర్మించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. సందీప్ కిషన్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. మేం ఇలా ఈ సినిమాకి కలిసి పని చేస్తుండటం ఆనందంగా ఉంది అని తెలిపారు.
