సాయి తేజ్ పేరుతో పాపకు పేరు పెట్టాలని అభిమాని కోరగా.. ఆ పాపకు సాయి తేజ్ పేరు కలిసి వచ్చేలా ‘తేజన్విత’ అని నామకరణం చేయడం విశేషం..
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అంటే తనకు ఎంత ఇష్టమో ఓ అభిమాని చాటుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ కోసం 9 నెలలు ఎదురుచూసి మరీ తన పాపకు నామకరణం చేయించుకున్నాడు. సాయి తేజ్ పేరుతో పాపకు పేరు పెట్టాలని అభిమాని కోరగా.. ఆ పాపకు సాయి తేజ్ పేరు కలిసి వచ్చేలా ‘తేజన్విత’ అని నామకరణం చేయడం విశేషం.
తేజన్వితకు సాయి ధరమ్ తేజ్ శుభాశీస్సులు అందజేశారు.. కాసేపు పాపని ఎత్తుకుని ఆడించారు. దీంతో ఆ అభిమానికి మరచిపోలేని జ్ఞాపకాన్ని అందించారు తేజ్.. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తేజ్.. మారుతి దర్శకత్వంలో ‘ప్రతి రోజూ పండగే’ సినిమా చేస్తున్నాడు.
Read Also : సైరా – వీడియో సాంగ్ చూశారా!
రాశీ ఖన్నా హీరోయిన్.. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ.. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ‘ప్రతి రోజూ పండగే’ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.