దర్శకుల సంఘానికి సూర్య రూ.10 లక్షల విరాళం

తమిళ స్టార్ హీరో సూర్య తమిళనాడు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల చెక్కు అందజేశారు..

  • Publish Date - October 11, 2019 / 04:24 AM IST

తమిళ స్టార్ హీరో సూర్య తమిళనాడు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల చెక్కు అందజేశారు..

తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ట్రస్ట్‌కు సూర్య విరాళాన్ని అందచేశారు. దీపావళి సందర్భంగా ఈ ప్రత్యేక విరాళాన్ని తమిళనాడు చలన చిత్ర దర్శకుల సంఘానికి ఇచ్చారు.

ఈ మేరకు దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ ఉదయ్ కుమార్‌కు ఆయన రూ.10 లక్షల చెక్కు అందజేశారు. దర్శకుల సంఘం సంక్షేమానికై సూర్య విరాళమిచ్చినందుకు దర్శకుల సంఘం ప్రతినిధులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also : సంజయ్ దత్, సునీల్ శెట్టిలతో మంచు విష్ణు..

సూర్య నటించిన ‘కాప్పాన్’ (బందోబస్త్) ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఆర్య, సయేషా, మోహన్ లాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకుడు..  సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ త్వరలో విడుదల కానుంది. ‘విశ్వాసం’ ఫేమ్ శివ దర్శకత్వంలోనూ సినిమా చెయ్యనున్నాడు సూర్య.