Vishwanath And Sons : హైదరాబాద్లో భారీగా సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే?
విశ్వనాధ్ & సన్స్ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. (Vishwanath And Sons)
Vishwanath And Sons
Vishwanath And Sons : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వనాధ్ & సన్స్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పలు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు.
విశ్వనాధ్ & సన్స్ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సౌత్ మొత్తం రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కూడా ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు చెన్నై, కేరళ కొచ్చిలో ఈవెంట్స్ నిర్వహించగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తాజాగా ప్రకటించారు. విశ్వనాధ్ & సన్స్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. రేపు ఆగస్టు 11న సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ జరగనుంది. మూవీ యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
Also See : Farnaz Shetty : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్.. ఫర్నాజ్ శెట్టి ఫొటోలు..
విశ్వనాధ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా చేయనున్నారు. తెలుగులో కూడా సూర్యకు అభిమానులు చాలామంది ఉన్నారని తెలిసిందే. రేపు విశ్వనాధ్ & సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీగా సూర్య అభిమానులు తరలిరానున్నారు. ఈ ఈవెంట్ కి మూవీ టీం మొత్తం హాజరవనుంది. గెస్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తారని సమాచారం.

