‘సైరా’ – హిస్టారికల్ 50 డేస్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించి హిస్టారికల్ మూవీ.. ‘‘సైరా నరసింహారెడ్డి’’ విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది..

  • Publish Date - November 20, 2019 / 09:32 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించి హిస్టారికల్ మూవీ.. ‘‘సైరా నరసింహారెడ్డి’’ విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించి హిస్టారికల్ మూవీ.. ‘‘సైరా నరసింహారెడ్డి’’.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో పోషించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ‘సైరా’ నవంబర్ 20 నాటికి విజయవంతంగా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. దాదాపు 30 కేంద్రాలలో 50 డేస్ జరుపుకుంటున్నట్టు సమాచారం.

Read Also : ‘‘RRR’’ హీరోయిన్, విలన్ వీళ్లే!

నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ్, కన్నడతో పాటు హిందీ వెర్షన్ కుడా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ‘సైరా’ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..