Jana Nayagan Deleted Scene: జననాయగన్ పై నటి ఆవేదన.. విజయ్ ఆఖరి సినిమా అని ఏడాది పాటు.. ఇలా చేస్తారనుకోలేదు..
Jana Nayagan Deleted Scene జననాయగన్ చిత్రంలో తాను నటించిన సన్నివేశాలు పూర్తిగా తొలగించారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది నటి ఆనంది (Anandhi Ajay).
Tamil Actress Anandhi breaks down as her scene is deleted in jana nayagan
Jana Nayagan Deleted Scene : తమిళ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ హీరోగా చేసిన చివరి సినిమా జన నాయగన్. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. పూజాహెగ్డే కథానాయికగా నటించిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో తాను నటించిన సన్నివేశాలు పూర్తిగా తొలగించారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది నటి ఆనంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియోను సైతం విడుదల చేసింది.
విజయ్ చివరి చిత్రం కావడం, ఆయనతో పని చేసే అవకాశం రావడంతో ఎంతో ఆనందించానని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం కోసం ఏడాది పాటు కష్టపడినట్లు వెల్లడించింది. అయితే.. రిలీజ్ అయిన తరువాత చూస్తే తాను నటించిన సన్నివేశాలు అన్నింటిని పూర్తిగా తీసివేశారని ఎంతో బాధపడుతూ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Also Read – Siri Hanumanthu : చెన్నై లవ్‌స్టోరీ షూటింగ్ పిక్స్‌ను షేర్ చేసిన సిరి హన్మంతు
View this post on Instagram
ఆనంది క్లాసికల్ డ్యాన్సర్, యోగా ట్రైనర్ కూడా. అంతేకాదండోయ్ పలు సీరియల్స్‌లోనూ నటించింది. డాన్స్ జోడి డాన్స్ 3.0, జోడి నంబర్ 1 వంటి రియాలిటీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సెన్సార్ పరమైన ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. 12 కీలక మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. ఈ క్రమంలోనే ఆనంది సన్నివేశాలు కట్ చేసి ఉండొచ్చునని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
