Ariana : ఈ క్యూట్ పాపాయి ఎవరో తెలుసా? ఆ హీరో – హీరోయిన్ కూతురు..
ఇంతకీ ఈ క్యూట్ పాపాయి ఎవరో అనుకుంటున్నారా?
![Ariana : ఈ క్యూట్ పాపాయి ఎవరో తెలుసా? ఆ హీరో – హీరోయిన్ కూతురు.. Ariana : ఈ క్యూట్ పాపాయి ఎవరో తెలుసా? ఆ హీరో – హీరోయిన్ కూతురు..](https://10tv.in/wp-content/uploads/2024/08/ariyana.jpg)
Tamil Star Couple Duaghter Ariana Birthday Photos goes Viral
Ariana : ఈ ఫొటోలో చూపించిన క్యూట్ పాపాయి ఇటీవలే మూడో పుట్టిన రోజు చేసుకుంది. ఈ పాపాయి ఫోటోలు, పాపాయి పుట్టిన రోజు ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ పాపాయి ఒక హీరో – హీరోయిన్ కూతురు. దీంతో అప్పుడే ఈ జంటకు పుట్టిన పాపకి మూడు ఏళ్ళు వచ్చేసాయా అని ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ ఈ క్యూట్ పాపాయి ఎవరో అనుకుంటున్నారా? తమిళ్ బ్యూటిఫుల్ కపుల్ ఆర్య – సాయేషాల కూతురు. ఆర్య తమిళ్, తెలుగు సినిమాలతో మనకు బాగా దగ్గరయ్యాడు. సాయేషా కూడా తమిళ్, తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ హీరో, హీరోయిన్ కొన్నాళ్ళు ప్రేమించుకొని 2019లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరికి కూతురు పుట్టింది. ఆర్య – సాయేషా కూతురు పేరు అరియనా.
ఇటీవలే అరియనా తన మూడో పుట్టిన రోజు జరిపి ఫ్యామిలీతో దిగిన ఫోటోలని సాయేషా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అరియనాకు కూడా సోషల్ మీడియా అకౌంట్ ఉంది. తన క్యూట్ ఫొటోలన్నీ ఆ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తారు.