Sivamani – Thaman : SP బాలు తనకు పంపిన చివరి మాటల్ని గుర్తుచేసుకొని.. ఏడ్చేసిన డ్రమ్స్ శివమణి.. తమన్ ఎమోషనల్..

తాజాగా తమన్, డ్రమ్స్ శివమణి SP బాలుని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

Sivamani – Thaman : SP బాలు తనకు పంపిన చివరి మాటల్ని గుర్తుచేసుకొని.. ఏడ్చేసిన డ్రమ్స్ శివమణి.. తమన్ ఎమోషనల్..

Thaman and Drums Sivamani got Emotional While Remembering SP Balu

Sivamani – Thaman : ఎన్నో పాటలతో ప్రేక్షకులని అలరించి మెప్పించిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా సమయంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం సినీ సంగీత పరిశ్రమకి తీరని లోటు. ఆయన లేకపోయినా ఆయన్ని తలుచుకుంటూ ఆయన పాటలు వింటూనే ఉంటాము. SP బాలు ఎంతోమంది సింగర్స్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ వ్యక్తులను పరిశ్రమకు పరిచయం చేసారు.

సంగీత పరిశ్రమలో ఉన్నవారందరికి SP బాలు అంటే చాలా ఇష్టం. తాజాగా తమన్, డ్రమ్స్ శివమణి SP బాలుని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఆహాలో జరుగుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి తాజా ఎపిసోడ్ లో డ్రమ్స్ శివమణి గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో SP బాలు పాడిన సాంగ్ విన్న తర్వాత శివమణి SP బాలుని గుర్తుచేసుకొని తనకు చివరగా ఆల్ ది బెస్ట్ అంటూ పంపిన వాయిస్ మెసేజ్ ని వినిపించి ఏడ్చేశాడు. తనకు ఆయన ఎంతగానో సపోర్ట్ చేసాడని తెలిపారు.

Also Read : Raayan Day 1 Collection : తొలి రోజే రూ.12కోట్ల‌కు పైగా కొల్ల‌గొట్టిన ధ‌నుష్ ‘రాయ‌న్’.. తెలుగులో ఎంతంటే..?

ఇక తమన్ కూడా SP బాలుని గుర్తుచేసుకుంటూ.. నన్ను ఫస్ట్ టైం 12 ఏళ్ళ వయసులో ఫ్లైట్ లో తీసుకెళ్లింది ఆయనే అని, మా నాన్న చనిపోయిన తర్వాత ఆయనే నాకు చాలా సపోర్ట్ చేసారని తెలిపాడు. ఆ టైంలో శివమణి కూడా నాకు చాలా సపోర్ట్ చేసాడని ఎమోషనల్ అయ్యాడు తమన్. దీంతో ప్రస్తుతం ఎపిసోడ్ ఆహాలో ట్రెండింగ్ గా మారింది.