మహేష్ కు థ్యాంక్స్ చెప్పిన కమల్ హాసన్
- veegam team
- Published on- November 12, 2019 / 05:27 AM IST
కమల్ హాసన్ నవంబర్ 7తో 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 7 కమల్ పుట్టినరోజే కాదు.. ఈ ఏడాదితో నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేస్తూ.. కమల్ సార్! మీరు సినిమాల్లో 60 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసినందుకు అభినందనలు. మీరు ఆనందంగా.. ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని మహేష్ తెలిపారు. అయితే గత రెండు మూడు రోజులుగా పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న కమల్ ఈ రోజు (నవంబర్ 12, 2019)న మహేష్ ట్వీట్‌కి స్పందించారు.
థాంక్యూ సో మచ్ మహేష్ జీ. మీరు కూడా చెయిల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించారు. మంచి విజయాలు సాధించారు. మీ హార్ట్ ఫెల్ట్ విషెస్ ని నేను అంగీకరిస్తున్నాను. మీకు ఎల్లప్పుడూ నా శుభాకాంక్షలు అని కమల్ తన ట్వీట్లో తెలిపారు.
