Soul Of Satya : ఏకంగా 8 ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న సాయిధరమ్ తేజ్ సినిమా

సాయిధరమ్ తేజ్, స్వాతి జంటగా నటించిన 'సత్య' షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. తాజాగా ఈ సినిమా మరో 8 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది.

Soul Of Satya : ఏకంగా 8 ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న సాయిధరమ్ తేజ్ సినిమా

Soul Of Satya

Soul Of Satya : సాయిధరమ్ తేజ్, స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’ ఏకంగా 8 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అనేక అవార్డులు సొంతం చేసుకున్న ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది.

Karthi : కార్తీకి కోటి రూపాయలు ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్.. థ్యాంక్స్ చెప్పిన విశాల్

సాయిధరమ్ తేజ్, స్వాతి జంటగా నవీన్ విజయ్ కృష్ణ ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను గత సంవత్సరం ఆగస్టు 15న విడుదల చేసారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కి ఎంతగానో ఆదరణ లభించింది. న్యూయార్క్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ‘ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌’లో రెండు అవార్డులు సొంతం చేసుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ తాజాగా ఫ్రాన్స్‌లో జరగనున్న’టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్‌’లో 8 అవార్డులకు ఎంపికైంది.

SP Charan : SP చరణ్ వర్సెస్ తరుణ్ భాస్కర్.. SP బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌ని అలా చేసినందుకు.. లీగల్ నోటిస్..

‘సత్య’ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ ఇండీ పార్ట్ విభాగాల్లో అవార్డులు అందుకోనున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై సాయిధరమ్ తేజ్ స్పందించారు. మంచి సినిమా ఎప్పుడూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుందని చెప్పారు. సాయిధరమ్ గత సినిమాలు విరూపాక్ష, బ్రో ఆశించినంతగా పేరు తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్‌లో చేస్తున్న ‘గాంజా శంకర్’ పైనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.