Bollywood : మొన్న సల్మాన్.. ఇప్పుడు రణవీర్.. భయం గుప్పిట్లో బాలీవుడ్.. మళ్ళీ అదే గ్యాంగ్..
బాలీవుడ్ నటీనటులకు ఇప్పుడు భయం నెలకొంది. (Bollywood)
Bollywood
Bollywood : బాలీవుడ్ నటీనటులకు ఇప్పుడు భయం నెలకొంది. గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్ బాలీవుడ్ ని బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ని చంపుతామని పలుమార్లు ఈ గ్యాంగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కి భారీ భద్రత ఏర్పాటు చేయడం, బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరగడం చేసారు.(Bollywood)
డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ కి బెదిరింపుల తర్వాత ఇప్పుడు బాలీవుడ్ మరో స్టార్ హీరో రణవీర్ సింగ్ కి బెదిరింపులు వచ్చాయి. రణవీర్ సింగ్ వాట్సాప్ కి కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ ఓ అజ్ఞాత వ్యక్తి వాయిస్ నోట్ పంపించాడు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన వ్యక్తి అని బెదిరించాడు.
Also Read : Anudeep : అనుదీప్ మామూలోడు కాదు.. ఫంకీ కోసం మొత్తం డైరెక్టర్స్, నిర్మాతలు అందర్నీ దించాడుగా..
రణవీర్ ఈ వాయిస్ నోట్ ని పోలీసులకు అందించి ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు ప్రస్తుతం రణవీర్ ఇంటి బయట భద్రతని ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మొన్న సల్మాన్, ఇప్పుడు రణవీర్ సింగ్.. లాంటి స్టార్ హీరోలను బెదిరించడంతో బాలీవుడ్ భయపడుతుంది.
