ముగ్గురు స్టార్స్ కలిసిన వేళ.. నవ్వుల మేళా.. వైరల్ అవుతున్న ఫొటో..
తాజాగా ముగ్గురు స్టార్స్ దిగిన ఫొటో వైరల్ గా మారయింది. బ్రహ్మానందం, అలీ, కోటశ్రీనివాసరావు కలిసి దిగిన ఫొటో వైరల్ అవుతుంది.

Three Stars Brahmanandam Ali Kota Srinivasa Rao Photo Goes Viral
Brahmanandam – Ali – Kota Srinivasa Rao : తాజాగా ముగ్గురు స్టార్స్ దిగిన ఫొటో వైరల్ గా మారయింది. బ్రహ్మానందం, అలీ, కోటశ్రీనివాసరావు కలిసి దిగిన ఫొటో వైరల్ అవుతుంది. ప్రస్తుతం కోటశ్రీనివాసరావు వయసు పెరగడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక బ్రహ్మానందం కూడా అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారు. అలీ మాత్రం సినిమాలు, షోలతో ఇంకా అలరిస్తున్నారు.
గతంలో ఈ ముగ్గురు కలిసి ఎన్నో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించారు. కోట – బ్రహ్మానందం, బ్రహ్మానందం – అలీ కాంబినేషన్స్ ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించాయి. తాజాగా ఈ ముగ్గురు కలవగా కోటశ్రీనివాసరావు కుర్చీలో కూర్చొని ఉండగా అటు ఇటు బ్రహ్మానందం, అలీ నిలబడి ఫొటో దిగారు. ఈ ముగ్గురు తమ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ గడిపారు. అయితే ఏ సందర్భం కోసం వీరు కలిశారు అనేది అధికారిక సమాచారం లేదు. ఈ ఫొటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Allu Arjun : దర్శకుడు VI ఆనంద్‌తో బన్నీ సినిమా.. కథ చెప్పాను కానీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..