Hfg
Locked 2: హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ లో బ్లాక్ బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ ‘లాక్డ్’ రెండో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. వైద్యశాస్త్రంలో కఠినతరమైన ఎన్నో కేసులకు పరిష్కారాలను సూచించిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ పాత్రలో మెప్పించడానికి సత్యదేవ్ మరోసారి సిద్ధమవుతున్నారు. అయితే అతని పేరు ప్రతిష్టలను నాశనం చేయగల ఓ రహస్యాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తాడు.
‘లాక్డ్’ సీజన్ 1ను డైరెక్ట్ చేసిన ప్రదీప్ దేవ కుమార్ సీజన్-2ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ ‘లాక్డ్’ సీజన్ 2 లో ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలెన్నో ఉంటాయి. ‘లాక్డ్’ సీజన్ 1లో చిన్న చిన్న దొంగతనాలు చేసే ముగ్గురు దొంగలు డాక్టర్ ఆనంద్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఆనంద్ జీవితంలోని చీకటి కోణం గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించే ఎంతో మంది నిమిషాల్లో హతమవుతుంటారు.
సత్యదేవ్, సంయుక్తా హెగ్డే, కేశవ్ దీపక్, శ్రీలక్ష్మి, బిందు చంద్రమౌళి తదితరులు నటించిన తొలి సీజన్‌లోని పలు ట్విస్టులు, టర్న్స్‌తో ప్రేక్షకులు ఓ ఉత్కంఠతకు లోనయ్యారు. కథ పరంగా, స్కేల్, విజన్ పరంగానే కాకుండా ‘లాక్డ్’ రెండో సీజన్ వెన్నులో ఓ భయాన్ని కలిగించేంత ఎలిమెంట్స్‌తో తెలుగు మాధ్యమాల్లో మేకింగ్ స్టాండర్స్ పరంగానూ సరికొత్త అర్థాన్ని చెప్పేలా ఉండబోతుంది.
Welcome back Doctor! We can’t wait to see you in action. @ActorSatyaDev https://t.co/uH7L3UV4i6
— ahavideoIN (@ahavideoIN) July 22, 2021