Vijay Thalapathy: టార్గెట్ విజయ్.. ఆయనకు వ్యతిరేకంగా ‘TN 2026’ మూవీ
ఎన్నికల వేళ తమిళనాట సినిమా రాజకీయం(Vijay Thalapathy).
TN 2026 Movie releasing Against Thalapathy Vijay
- తమిళనాట సినిమా రాజకీయం
- హీరో విజయ్ కి వ్యక్తిరేకంగా మూవీ
- ప్రముఖ పార్టీ ఫండింగ్ తోనే అంటూ కామెంట్స్
Vijay Thalapathy: తమిళ రాజకీయాల్లో సినిమా ప్రభావం ఎప్పుడూ ఎక్కువే. ప్రస్తుతం తమిళ వెట్రి కజగం (TVK) పార్టీతో ఎన్నికల బరిలోకి దిగుతున్న స్టార్ హీరో విజయ్(Vijay Thalapathy)ను లక్ష్యంగా చేసుకుని ‘TN 2026’ అనే సినిమా తెరకెక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సినిమాకు ప్రముఖ నటుడు తంబిరామయ్య స్క్రిప్ట్ అందించగా, ఆయన కుమారుడు ఉమాపతి రామయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరో నటరాజన్ లుక్ చూస్తుంటే అచ్చం విజయ్ లాగే ఉంది. సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఒక స్టార్ కథగా దీనిని చిత్రీకరించడంతో, ఇది విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశించి తీసిందేనని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
Mani Ratnam: మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి- సాయి పల్లవి.. మరో అద్భుతమైన ప్రేమ కథతో
తంబిరామయ్యకు ప్రముఖ పార్టీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, ఆ పార్టీ ఫండింగ్తోనే విజయ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి ఈ ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సలహాదారులు సైతం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై తంబిరామయ్య స్పందిస్తూ, ఇందులో విజయ్ను కించపరిచే సన్నివేశాలేవీ లేవని, సినిమా చూశాక అందరి అనుమానాలు పటాపంచలవుతాయని వివరణ ఇచ్చారు.
రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ పరిణామాలపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా ద్వారా విజయ్ను కావాలని టార్గెట్ చేస్తే, అది వారికే రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో ఉన్న విజయ్ ఇమేజ్ కారణంగా, ఇలాంటి ప్రయత్నాలు సానుభూతిగా మారి వారికే అసలుకే మోసం తెచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 2026 ఎన్నికల లక్ష్యంగా సాగుతున్న ఈ సినిమా పోరు తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
