Trigun : బిగ్‌బాస్ త్రిగుణ్ కొత్త సినిమా అనౌన్స్..
Trigun : త్రిగుణ్, నేహా పఠాన్ జంటగా నటిస్తున్న చిత్రం జంగా.
Trigun look from Janga movie
Trigun : త్రిగుణ్, నేహా పఠాన్ జంటగా నటిస్తున్న చిత్రం జంగా. ఈ చిత్రానికి కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, చందు గౌడ,సమీర్, నాగ మహేష్, భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి కీలక పాత్రలను పోషిస్తున్నారు. వనిత కిలారి సమర్పణలో ఆర్కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా హీరో త్రిగుణ్ పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో త్రిగుణ్ ‘శివ’ అనే పాత్రలో రా అండ్ రస్టిక్ కారెక్టర్‌ను పోషిస్తున్నారు. విడుదల చేసిన లుక్ ఆకట్టుకుంటోంది.
Sridevi Vijaykumar : నటి శ్రీదేవి పుట్టిన రోజు.. సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్..

ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వెంకట్ సి.దిలీప్ కెమెరామెన్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
