Trisha : సినిమా కోసం ఇరవై రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్.. దెబ్బకి హాస్పిటల్లో పడి ఇంకో సినిమాకి నో చెప్పి..

2004లో వర్షం సినిమాతో డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ అయింది త్రిష.

Trisha : సినిమా కోసం ఇరవై రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్.. దెబ్బకి హాస్పిటల్లో పడి ఇంకో సినిమాకి నో చెప్పి..

Trisha Krishnan Health Effected Due to Continue 20 Days Shoot in Rain

Trisha : 24 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా ఇంకా హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది త్రిష. నిన్నే 40 ఏళ్ళు పూర్తి చేసుకొని 41వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ తమిళ ముద్దుగుమ్మ. 40 ఏళ్ళు దాటినా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రేక్షకులని మెప్పిస్తుంది.

1999లో జోడి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష 2002లో తమిళ సినిమాతో హీరోయిన్ గా మారింది. 2003లో నీ మనసు నాకు తెలుసు అనే బైలింగ్వల్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చినా 2004లో వర్షం(Varsham) సినిమాతో డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా స్టార్ అయింది త్రిష. ప్రభాస్(Prabhas), త్రిష జంటగా వచ్చిన వర్షం సినిమా భారీ విజయం సాధించి ఇద్దర్ని స్టార్స్ ని చేసింది. టైటిల్ కి తగ్గట్టు ఈ సినిమాలో చాలా వర్షం సీన్స్ ఉంటాయి. హీరో కంటే కూడా హీరోయిన్ ఎక్కువగా ఈ సినిమాలో వర్షంలో తడుస్తుంది.

Also Read : Salaar : ‘సలార్’ జపాన్ రిలీజ్ ట్రైలర్ చూశారా? జపాన్ లో సలార్ రిలీజ్ ఎప్పుడంటే..

త్రిష వర్షం సినిమా కోసం ఆల్మోస్ట్ 20 రోజుల పాటు వర్షంలో తడిసింది. వర్షం సీన్స్ అన్ని తీయడానికి దాదాపు 20 రోజులు తీసుకున్నారట. 20 రోజులు వర్షంలో సీన్స్ తీయడంతో జ్వరం, జలుబు వచ్చి త్రిష కండిషన్ సీరియస్ అయిందట. ఆ దెబ్బకి హాస్పిటల్లో చేరింది. ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా ఎలా రిజల్ట్ వస్తుందో అని భయపడినా పెద్ద హిట్ అయింది వర్షం సినిమా. దీంతో త్రిష అంత కష్టపడి హాస్పిటల్లో చేరినా సినిమా హిట్ అయిందని సంతోషపడింది. అయితే వర్షం సినిమాని తమిళ్ లో రీమేక్ చేసారు. ఈ రీమేక్ కి కూడా త్రిషని హీరోయిన్ గా అడిగితే వర్షం వల్ల తాను ఎఫెక్ట్ అయింది గుర్తుంచుకొని చేయను అని చెప్పిందట. మొత్తానికి ఇంత కష్టపడినందుకు తెలుగులో త్రిష గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది వర్షం సినిమాతో.