Trisha Political Entry: పదేళ్లలో సీఎం అవుతా.. చెప్పి మరీ కొట్టారుగా.. వైరల్ అవుతున్న త్రిష షాకింగ్ వీడియో
పొలిటికల్ ఎంట్రీపై పదేళ్ల క్రితమే షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిష(Trisha Political Entry).
trisha political entry, old video getting viral on social media
- త్రిష రాజకీయ అరంగేట్రంపై జోరుగా ప్రచారం.
- విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష.
- పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు వైరల్.
Trisha Political Entry: స్టార్ బ్యూటీ త్రిష ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తమిళనాడు ఎలక్షన్స్ లో విజయ్ విజయం సాధించిన నేపధ్యంలో ఆమె రాజకీయ రంగప్రవేశం గురించి జరుగుతున్న ప్రచారంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా 2004లో ఆమె ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో “వచ్చే పదేళ్లలో నేను ముఖ్యమంత్రిని అవుతాను” అని ఆమె చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారాయి. సరదాగా అన్న మాటలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా అన్న సందేహం అందరిలోనూ మొదలైంది.
మరోవైపు, తమిళ రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ స్థాపించిన ‘TVK’ పార్టీ విజయపథంలో దూసుకుపోతుండటంతో, విజయ్-త్రిష(Trisha Political Entry)ల హిట్ కాంబినేషన్ ఇప్పుడు రాజకీయాల్లోనూ కొనసాగనుందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి వ్యక్తిగత జీవితాల గురించి వస్తున్న వార్తల నడుమ, త్రిష తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, ఆ వెంటనే నేరుగా చెన్నైలో విజయ్ ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ భేటీ కేవలం శుభాకాంక్షల కోసమేనా లేక పార్టీలో చేరికపై కీలక నిర్ణయమా అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఒకవేళ త్రిష అధికారికంగా విజయ్ పార్టీలో చేరితే, తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలవ్వడం ఖాయం. సినిమా తెరపై మెప్పించిన ఈ జోడీ, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో కూడా కలిసి అడుగులు వేయబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 15 ఏళ్ల క్రితం త్రిష అన్న మాటలు ఆమెను అసెంబ్లీ మెట్లు ఎక్కించేలా చేస్తాయో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ పరిణామాలు తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి.
