అంత విరాళమా?.. ఆలోచించుకో అన్నాను.. అక్షయ్ ఏమన్నాడంటే..
కరోనా ఎఫెక్ట్ : అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల విరాళంపై స్పందించిన భార్య ట్వింకిల్ ఖన్నా..
- sekhar
- Published on- March 29, 2020 / 12:08 PM IST
కరోనా ఎఫెక్ట్ : అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల విరాళంపై స్పందించిన భార్య ట్వింకిల్ ఖన్నా..
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోలు, సినీ నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఎం కేర్స్ ఫండ్‌కి రూ.25 కోట్ల విరాళాన్ని అందించారు. ఇప్పటి వరకు బాలీవుడ్ నటీనటులలో ఇంత భారీగా విరాళం ప్రకటించిన వారు లేరు. తాజాగా అక్షయ్ ప్రకటించిన విరాళంతో.. బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే అక్షయ్ ఇంత భారీ మొత్తం విరాళం ఇవ్వాలనుకున్నప్పుడు అతని భార్య ట్వింకిల్ ఖన్నా ఎలా స్పందించారు అనే విషయం ఓ ట్వీట్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారామె.
‘‘నా భర్త రూ. 25 కోట్లు విరాళం ఇచ్చి నేను ఎంతో గర్వపడేలా చేశారు. అయితే ఆయన ఈ విరాళం ప్రకటించే ముందు ఒకసారి ఆలోచించుకోమని అన్నాను. ఇంత మొత్తం ఇస్తే.. మనకి కూడా కొంత మనీ అవసరం కదా.. అని గుర్తుచేస. దీనికి ఆయన ఏమన్నారంటే.. ‘నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఇలాంటి స్థాయిలో ఉన్నానంటే కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఏమీ లేని వారి కోసం ఏదైనా సహాయం చేయకుండా ఎలా ఉండగలను’ అనే సమాధానం ఇచ్చారు..’’ అని ట్వింకిల్ ఖన్నా తన ట్వీట్‌లో తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ.. అక్షయ్‌ని అభినందిస్తూ.. ‘‘గొప్ప మనసు చాటుకున్నారు..’’ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
