Kavya Kalyanram : ‘గంగోత్రి’ బేబి కావ్య ఇప్పుడెలా ఉందో చూశారా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డెబ్యూ మూవీ ‘గంగోత్రి’ లో చిన్నప్పటి గంగోత్రి క్యారెక్టర్ చేసింది ఈ కావ్యనే..

Kavya Kalyanram: కావ్య కళ్యాణ్‌రామ్.. పేరు చెప్తే గుర్తు పట్టడం కష్టమేకానీ.. ఇప్పుడీమె పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కావ్య ఎవరో తెలుసా..? ఒకప్పటి బాలనటి కానీ ఇప్పుడు సినిమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ కావ్య ఇప్పుడేం చేస్తుందో తెలుసా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డెబ్యూ మూవీ ‘గంగోత్రి’ లో చిన్నప్పటి గంగోత్రి క్యారెక్టర్ చేసింది ఈ కావ్యనే. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బేబి కావ్య తర్వాత ‘విజయేంద్రవర్మ’ లో బాలకృష్ణ-లయల పాపగా నటించింది. చిరంజీవి ‘ఠాగూర్’, నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’, వెంకటేష్ ‘సుభాష్ చంద్రబోస్’ సినిమాల్లోనూ కావ్య యాక్ట్ చేసింది. తెలుగు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తూనే స్టడీస్ కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

హైదరాబాద్‌కి చెందిన కావ్య లా పట్టాపుచ్చుకుంది కూడా. త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ గతేడాది ‘మసూద’ అనే సినిమాతోనే కావ్య కథానాయికగా ఇంట్రడ్యూస్ అయింది. ఇటీవల జిమ్‌కి వెళ్తున్న కావ్యను గుర్తుపట్టి కొందరు నెటిజన్స్ తీసిన ఫొటోలు నెట్టింట సందడి చేశాయి. ఇక kavya_kalyanram అనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో కావ్య షేర్ చేసే మోడరన్ అండ్ అల్ట్రా స్టైలిష్ పిక్స్‌కి భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు