జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. రికార్డ్స్ సెట్ చేస్తున్న పవర్‌స్టార్..

Vakeel Saab Satellite: జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. పవర్ స్టార్ రంగంలోకి దిగితే రికార్డులు హాంఫట్ అవ్వాల్సిందే.. కొత్త రికార్డులు క్రియేట్ కావాల్సిందే.. రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో పాటు కొత్త బిజినెస్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 26వ సినిమా ‘వకీల్ సాబ్’.. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయిక కాగా అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ రైట్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు ‘వకీల్ సాబ్’.. ఇప్పటికే హిందీ, తమిళ్ భాషల్లో విడుదలై విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో ఇప్పటివరకు ఏ సినిమాకి సాధ్యం కానంత హైయ్యెస్ట్ రేటుకి అమ్ముడయ్యింది.

‘వకీల్ సాబ్’ తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రూ. 50 కోట్లకు సేల్ అయ్యాయి.. ఇప్పటివరకు తెలుగులో ఏ సినిమా కూడా ఇంత భారీ ధరకు అమ్ముడుకాలేదు.. ఆ రకంగా పవన్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఏప్రిల్ 9న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు