Varanasi : మహేష్ బాబు ‘అర్జున్’ షూటింగ్ చేసిన చోటే.. ‘వారణాసి’ షూట్..?
మళ్ళీ వారణాసి సినిమాని అదే స్థలంలో పలు సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారట. (Varanasi)
Varanasi
Varanasi : రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమా భారీగా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని ఒరిస్సా, టాంజానియా అడవులు, జార్జియా, పలు దేశంలో చిత్రీకరించారు. కొన్ని సన్నివేశాలు హైదరాబాద్ లో పలు చోట్ల సెట్స్ వేసి కూడా చిత్రీకరించారు. వారణాసి సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ దగ్గర కాశీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. అలాగే VFX వాడే సీన్స్ కోసం కూడా బ్లూ మ్యాట్స్ తో సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు.
తాజాగా సమాచారం ప్రకారం మహేష్ బాబు అర్జున్ సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్ లో వారణాసి షూటింగ్ చేస్తున్నారట. మహేష్ బాబు అర్జున్ సినిమా కోసం ఏకంగా మధురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ సెట్ ని హైదరాబాద్ శివార్లలో కోకాపేట వద్ద ఉన్న మహేష్ సొంత స్థలంలోనే వేసి షూటింగ్ చేసారు. కొన్నాళ్ళు ఆ సెట్ ని పలు సినిమాలు వాడుకున్నాక తీసేసారు.
ఇప్పుడు మళ్ళీ వారణాసి సినిమాని అదే స్థలంలో పలు సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారట. మహేష్ సొంత స్థలంలో అర్జున్ సినిమాకు మీనాక్షి అమ్మవారి సెట్ వేసిన స్థలంలో భారీ బ్లూ మ్యాట్స్ తో సెట్స్ వేసి వారణాసి షూటింగ్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 రిలీజ్ అవుతుందని ప్రకటించినా ఆ డేట్ కి వస్తుందని కచ్చితంగా అయితే చెప్పలేరు.
