VarunLav : తాళి కడుతున్న వరుణ్.. సంతోషంలో లావణ్య..

ఇప్పటికే మెగా హీరోలు, మెగా బ్రదర్స్, బాబాయ్-అబ్బాయి ఫోటోలు బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా లావణ్య మేడలో వరుణ్ మూడుముళ్లు వేస్తున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది.

VarunLav : తాళి కడుతున్న వరుణ్.. సంతోషంలో లావణ్య..

Varun Tej tie a knot to Lavanya Tripathi Wedding Photos

VarunLav : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ముగిసింది. నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జ‌రిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వరుసగా ఒక్కొక్కటి బయటకి వస్తున్నాయి. ఇప్పటికే మెగా హీరోలు, మెగా బ్రదర్స్, బాబాయ్-అబ్బాయి ఫోటోలు బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా లావణ్య మేడలో వరుణ్ మూడుముళ్లు వేస్తున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది.

ఆ ఫొటోలో వరుణ్ తాళి కడుతుంటే.. లావణ్య సంతోషంతో నవ్వుతు కనిపిస్తుంది. ఈ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక అలాగే లావణ్య చేతిలో కొబ్బరికాయ పట్టుకొని పెళ్లి మండపం దగ్గరకి నడుచుకొని వస్తున్న ఫోటో, పెళ్లి తరువాత వరుణ్-లావణ్య కలిసి నడుస్తున్న పిక్ కూడా బయటకి వచ్చి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆ బ్యూటిఫుల్ పిక్స్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Ram Charan : మెగా వెడ్డింగ్‌లో రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..?

Varun Tej tie a knot to Lavanya Tripathi Wedding Photos

Varun Tej tie a knot to Lavanya Tripathi Wedding Photos

Varun Tej tie a knot to Lavanya Tripathi Wedding Photos

కాగా ఈ పెళ్లి వేడుక నుంచి ఒక్కొక్కరిగా ఇండియా తిరిగి వస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. మరి కొత్త జంట ఎప్పుడు హైదరాబాద్ రానున్నారో చూడాలి. ఇక ఈ నవంబర్ 5న ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇండస్ట్రీ పర్సన్స్ కోసం హైదరాబాద్ లో ఒక రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో జరగనుంది.