Kalyani Menon : సింగర్ కళ్యాణి ఇకలేరు..

తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు హిట్ సాంగ్స్ పాడి సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు కళ్యాణి..

Kalyani Menon: ప్రముఖ సింగర్ కళ్యాణి మీనన్ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. పాపులర్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ రాజీవ్ మీనన్ తల్లి కళ్యాణి. కేరళలోని ఎర్నాకుళంకు చెందిన కళ్యాణి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. పదేళ్ల వయసులోనే పాడడం స్టార్ట్ చేశారు.

తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు హిట్ సాంగ్స్ పాడి సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఎమ్ఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి లెజెండ్స్ కంపోజిషన్‌లో కళ్యాణి అద్భుతమైన పాటలు పాడారు. రెహమాన్ మ్యూజిక్ ఆల్బమ్ ‘వందేమాతరం’ లోనూ కళ్యాణి పాడారు.

భక్తి సంగీతానికి కళ్యాణి చేసిన కృషికిగాను 2010 లో తమిళనాడు ప్రభుత్వం ఆమెను ‘కళైమామణి’ అవార్డు అందించింది. అలాగే కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డులు కళ్యాణి అందుకున్నారు. కళ్యాణి మీనన్ మృతికి కేరళ సీఎం పినరయి విజయన్, ఏఆర్ రెహమాన్, సింగర్ చిత్ర, సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ సంతోష్ శివన్ తదితరులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. తమిళ్, మలయాళ ఇండస్ట్రీల వారు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు