Vijay Deverakonda Family : శ్రీవారి సన్నిధిలో దేవరకొండ ఫ్యామిలీ
విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు..
- sekhar
- Published On : October 10, 2021 / 12:50 PM IST
Deverakonda Family
Vijay Deverakonda Family: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విజయ్, తల్లిదండ్రులు మాధవి దేవరకొండ, గోవర్థన్ రావు దేవరకొండ, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి తిరుమల చేరుకున్నారు.
ఆలయ అధికారులు, అర్చకులు విజయ్ కుటుంబానికి వేదమంత్రాలతో స్వాగతం పలికారు. నవరాత్రుల టైంలో స్వామివారిని దర్శించుకోవాలనుకుని, కుటుంబంతో కలిసి వచ్చానని విజయ్ తెలిపాడు.
Vijay Deverakonda Mother : అమ్మకు ప్రేమతో అదిరిపోయే గిఫ్ట్..
ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు విజయ్. ఇటీవల ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహబూబ్ నగర్‌లో ఏషియన్ విజయ్ దేవరకొండ (AVD Cinemas) అనే మల్టీప్లెక్స్ స్థాపించాడు విజయ్.
