Rashmika – Vijay : రష్మిక పెట్టుకుంది.. మరి విజయ్ మర్చిపోయాడు ఏంటి? విజయ్ ఎంగేజ్మెంట్ రింగ్ ఎక్కడ?
నిశ్చితార్థం తర్వాత ఈ ఇద్దరూ కలిసి కనపడలేదు. కానీ విడివిడిగా బయట పలుమార్లు కనపడటంతో వీళ్ళ ఎంగేజిమెంట్ రింగ్స్ వైరల్ అయ్యాయి.(Rashmika - Vijay )
Rashmika - Vijay
Rashmika – Vijay : రష్మిక – విజయ్ దేవరకొండ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారని తెలిసిందే. అధికారికంగా వాళ్ళు ప్రకటించకపోయినా వాళ్ళ టీమ్ మీడియాకు సమాచారం ఇచ్చారు. నిశ్చితార్థం తర్వాత ఈ ఇద్దరూ కలిసి కనపడలేదు. కానీ విడివిడిగా బయట పలుమార్లు కనపడటంతో వీళ్ళ ఎంగేజిమెంట్ రింగ్స్ వైరల్ అయ్యాయి.(Rashmika – Vijay )
రష్మిక, విజయ్ వేళ్ళకు కొత్త రింగ్స్ ఉండటం, ఓ షోలో ఆ రింగ్ గురించి ఇండైరెక్ట్ గా రష్మిక హింట్ ఇవ్వడంతో అవి విజయ్ – రష్మిక నిశ్చితార్థం రింగ్స్ అని అందరికి క్లారిటీ వచ్చేసింది. అయితే నేడు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.
Also Read : RGV : బ్యాక్ టు బ్యాక్ రీ రిలీజ్ లు చేస్తున్న ఆర్జీవీ.. శివ తర్వాత ఏ సినిమానో తెలుసా? ట్రైలర్ కూడా రిలీజ్..
ఈ ఈవెంట్లో కూడా రష్మిక చేతికి ఎంగేజిమెంట్ రింగ్ పెట్టుకొనే వచ్చింది. అయితే విజయ్ మాత్రం ఎంగేజిమెంట్ రింగ్ లేకుండా రావడం గమనార్హం. దీంతో విజయ్ – రష్మిక ఫోటోలు వైరల్ అవ్వగా విజయ్ ఎంగేజిమెంట్ రింగ్ ఏది అని ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఈ ఈవెంట్లో రష్మిక – విజయ్ లు తమ నిశ్చితార్థం, పెళ్లి గురించి మాట్లాడతారేమో అని ఎదురుచూస్తుంటే విజయ్ ఏకంగా నిశ్చితార్థం రింగ్ లేకుండా రావడం, ఈవెంట్లో పక్కపక్కన కూర్చోకుండా దూరంగా కూర్చోడంతో ఇదేంటి అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Girija Oak : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అందాల భామ ఎవరు..? ఒక్క ఇంటర్వ్యూతో షేక్ చేసేస్తుందిగా..
